Work From Home : కరోనా కారణంగా అన్నీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ స్టార్ట్ చేశాయి. ఆ తర్వాత చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ను నిలిపివేశాయి. అయితే చాలా మంది ఉద్యోగులు ఇంటి వాతావరణం కు అలవాటు పడిపోయారు. ఇక ఈమధ్య ప్రముఖ కంపెనీలు కొన్ని ఉద్యోగులు కార్యాలయకు రావాలని ఫోర్స్ చేసిన సరే ఉద్యోగులు మాత్రం ఇంటి నుంచే పని చేస్తాం అంటున్నారు. ఇక ఇలాగే చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడంతో చేసేదేం లేక ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్తున్నారు. ఇది ఇలా ఉండగా కొన్ని ప్రముఖ కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రం హోమ్ కి ప్రిపరెన్స్ ఇస్తున్నాయి. వారానికి కొన్ని రోజులు కార్యాలయానికి వస్తే చాలని కొన్ని కంపెనీస్ ప్రకటించాయి. ఆ 10 కంపెనీలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. టీసీఎస్, విప్రో : భారతదేశంలోని ఈ ప్రముఖ దిగ్గజ కంపెనీలు వర్క్ ఫ్రం హోం ను ఇంకా కొనసాగిస్తున్నాయి .
అలాగే వారానికి రెండు లేదా మూడుసార్లు కార్యాలయానికి వస్తే సరిపోతుందని ఆదేశించాయి. ట్విట్టర్ : ట్విట్టర్ సీఈఓ అయినా “పరాగ్ అగర్వాల్” ఉద్యోగులకు ఒక ఆఫర్ ఇచ్చాడు. మీరు ఎక్కడ ఉండి పని చేసిన సరే సురక్షితంగా పనిని కంప్లీట్ చేయాలని, అలాగే ఈవెంట్స్ ,వర్క్స్ కంపేర్ చేస్తూ సమయానుకూలంగా వర్క్ చేయాలి అంటూ ట్విట్ చేశారు. అట్లాసీయిస్ : ఆస్ట్రేలియా కు చెందిన ఈ కంపెనీ తన ఉద్యోగులకు ఎక్కడి నుంచైనా పనిచేసుకునే విధంగా అవకాశం కల్పించింది. అలాగే “టీం ఎనీవేర్ ” ప్రకారం ఉద్యోగులు సంవత్సరానికి నాలుగు సార్లు కార్యాలయానికి రావాల్సి ఉంటుందని పేర్కొంది. సాప్ : లక్ష మంద ఉద్యోగుల కోసం సాఫ్ట్ వెర్ ను రూపొందించింది షాప్. దీని ద్వారా అందరూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. పుజిట్స్ : జపాన్ కు చెందిన ఈ కంపెనీ కరోనా కారణంగా తన కార్యాలయాలను సగానికి తగ్గించింది.

80 వేల మందికి ఇంటి నుంచి పనిచేయడానికి అవకాశం ఇచ్చింది. టాటా స్టీల్: 2020 నుండి టాటా స్టీల్ ,కంపెనీ వర్క్ ఫ్రం హోమ్ ను కొనసాగిస్తుంది. అలాగే దీనికి “ఎజైల్ వర్కింగ్ మోడల్ ” అని పేరు కూడా పెట్టారు. స్వీగ్గీ : స్విగ్గీ ఉద్యోగులు ఎక్కడ ఉన్నా సరే రిమోట్ కంట్రోల్ కిందికే వస్తారు. ఎందుకంటే వారి వర్క్ డీటెయిల్స్ ను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయవలసి ఉంటుంది. స్విగ్గీ ఉద్యోగులు కూడా చాలా మంది ఇంట్లో ఉండే వర్క్ చేస్తున్నారు. స్పూటీ: ఈ కంపెనీ 2021 ఫిబ్రవరి 14న కొత్త పాలసీను తీసుకొచ్చింది. ఇకపై పని కోసం ఎవరూ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. అవేబర్: ఈ కంపెనీ తన వ్యాపార క్లయింట్లతో ఈ మెయిల్ మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడర్ పూర్తిగా రిమోట్ కంట్రోల్ ద్వారా వర్క్ ఫ్రం హోమ్ ను నిర్వహిస్తుంది. 3ఎం : ఈ కంపెనీ మొత్తం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ను ప్రకటించింది.