Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ ఏ బిజినెస్ చేయాలో అర్థం కాక సతమతమవుతుంటారు. అలాంటి వారికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్నిచ్చే బిజినెస్ ఉంది. అది ఏ బిజినెస్ నో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్రజలు ఆహారం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు. పరిశుభ్రమైన, రసాయన మందులు లేని ఉత్పత్తులను తినడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సాగు చేసే సమయంలో రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వేసి పండిస్తే ప్రజలు వాటిని కొనడానికి ఆసక్తి చూపుతారు.
సాధారణంగా అరటి కాండం పనికిరానిది అనుకుని దానిని కట్ చేసి పారేస్తుంటారు. అయితే ఈ అరటి కాండం నుంచి డబ్బులను సంపాదించవచ్చు. అరటి పంటలు పండించే రైతులు కాండంను తీసి పారేస్తారు. ఇది పర్యావరణం మరియు నేలకు ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో నేల సారం తగ్గుతుంది. అయితే ఈ కాండం సేంద్రియ ఎరువుగా మార్చితే లాభాలను పొందవచ్చు. అరటి కాండం ఎరువులు తయారు చేయటానికి ముందుగా ఒక గొయ్యి తవ్వి, అరటి కాండం, ఆవు పేడ,

కలుపు మొక్కలు వేయాలి. దీంతోపాటు డికంపోజర్ స్ప్రే చేయాలి. ఈ కాండం మరియు ఇతర పదార్థం సేంద్రియ ఎరువుగా తయారవుతుంది. దీనిని రైతులు తమ పొలాలలో పంటలు పండించడానికి ఉపయోగించవచ్చు. ఈ సేంద్రియ ఎరువుని మార్కెట్లో విక్రయించవచ్చు. దీంతోఅధిక ఆదాయం పొందవచ్చు. సేంద్రియ ఎరువుకి తయారీకి పెద్దగా ఖర్చు ఉండదు. దీనివలన సంపాదన మరియు నికర లాభం ఒకే విధంగా ఉంటుంది. సేంద్రియ ఎరువును ఉపయోగించడం వలన నేల బలంగా ఉంటుంది. అలాగే ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.