Business Idea : వీటిలో ఏ బిజినెస్ పెట్టుకున్నా.. నెలకు 50 వేల నుంచి లక్ష వరకు సంపాదించవచ్చు.. ఎలాగంటే?

Advertisement

Business Ideas : డబ్బులు ఊరికే ఎవరికీ రావు. డబ్బులు సంపాదించడం అనేది ఒక టెక్నిక్ అంతే. కొంచెం బుర్ర ఉపయోగిస్తే చాలు.. ఎవ్వరైనా డబ్బులు సంపాదించవచ్చు.. ఇందులో ఏదో మతలబు ఉంది అనుకుంటారు. ఊళ్లలో పుట్టి పెరిగి.. ఏమాత్రం చదువుకోని వాళ్లు కూడా నేడు చిన్న చిన్న బిజినెస్ లు పెట్టి లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. చూడటానికి అవి చిన్న బిజినెస్ ల లాగానే ఉంటాయి కానీ.. ఆ బిజినెస్ వల్ల లక్షలు సంపాదించుకోవచ్చు. అయితే.. ఊళ్లలోనే ఉండి.. ఏదైనా మంచి బిజినెస్ చేసుకొని కాస్తో కూస్తో సంపాదించాలని అనుకునేవాళ్లకు ఈ బిజినెస్ లు కరెక్ట్ గా సరిపోతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

Advertisement

ఊళ్లలో అయినా సిటీల్లో అయినా పాల బిజినెస్ సూపర్ గా నడుస్తుంది. ఈరోజుల్లో ప్రతి ఒక్కరు.. ప్రతి ఇంట్లో పాల అవసరం ఉంటుంది. పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంటికి వచ్చే పాలు కొనుక్కొని వెళ్తారు. లేదంటే దగ్గర్లోని పాలకేంద్రంలో పాలు పోయొచ్చు. రెండు గేదెలు లేదా ఆవులు కొనుగోలు చేసినా చాలు.. అటూ ఇటుగా ఒక లక్ష రూపాయలు పెట్టుబడితే నెలకు ఎటు లేదన్నా.. రూ.50 వేల వరకు ఆదాయం పొందొచ్చు. చాలామంది ఫ్లవర్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. ఏ శుభకార్యం అయినా సరే.. పువ్వుల అవసరం ఖచ్చితంగా ఉంటుంది. పూల ఆర్డర్స్ ఒకేసారి వస్తాయి. కాస్త పొలం ఉంటే చాలు..

Advertisement
Business Idea on Start a flower business
Business Idea on Start a flower business

Business Idea : ఫ్లవర్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది?

సొంతంగా పండించి పువ్వులను అమ్ముకోవచ్చు. లేదంటే హోల్ సేల్ గా పువ్వులను కొని శుభకార్యాలకు ఆర్డర్ తీసుకొని డెలివరీ చేయొచ్చు. ఎలా చేసినా.. నెలకు ఈ బిజినెస్ మీద మంచిగానే మిగులుతుంది. ఇంకా తేనె వ్యాపారం కూడా బాగానే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ బిజినెస్ కు సబ్సిడీ ఇస్తుంది. కేంద్రం ఆర్థిక సాయంతో ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసి లక్షలు సంపాదించవచ్చు. కాస్త ప్లేస్ ఉన్నవాళ్లు కోళ్ల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. లేదంటే కురగాయల వ్యాపారం కూడా బాగానే ఉంటుంది. చెలక ఉంటే.. పలు రకాల కూరగాయలు పండించి మార్కెట్ కు అమ్మవచ్చు. కోళ్ల వ్యాపారానికి కూడా ప్రస్తుతం మంచి రాబడి ఉంది. కేంద్రం కూడా పౌల్ట్రీ బిజినెస్ కు ఆర్థిక సాయం చేస్తుంది.

Advertisement