Business Idea : క్లౌడ్ కిచెన్ అనే పేరు విన్నారా? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే బెస్ట్ బిజినెస్ ఈ క్లౌడ్ కిచెన్. అసలు క్లౌడ్ కిచెన్ ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? దాని గురించి తెలుసుకుందాం కానీ.. సాధారణంగా ఎవరైనా జాబ్ కాకుండా బిజినెస్ చేయాలనుకుంటే చాలా బిజినెస్ లు ఉంటాయి. సొంతంగా ఒక బిజినెస్ పెట్టి తమ కాళ్ల మీద తాము నిలబడాలని అనుకుంటారు. అందులో భాగంగానే చాలా బిజినెస్ లను ప్రయత్నిస్తారు. చేయడానికి ఎన్నో బిజినెస్ లు ఉన్నాయి కానీ.. ఆ బిజినెస్ వల్ల కాస్తో కూస్తో లాభం రావాలి కదా. అటువంటి లాభం వచ్చే బిజినెస్ లలో బెస్ట్ క్లౌడ్ కిచెన్. దీని కోసం రెస్టారెంట్ పెట్టాల్సిన అవసరం లేదు.
డెకరేషన్, ఫర్నీచర్, వర్కర్స్ ఇవేవీ అవసరం లేకుండా మీ ఇంట్లోనే క్లౌడ్ కిచెన్ బిజినెస్ ను ప్రారంభించుకోవచ్చు. లేదంటే ఒక చిన్న రూమ్ తీసుకొని దాంట్లో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే.. ఈ వ్యాపారం ఇంట్లోనే చేసుకోవచ్చన్నమాట. ఆన్ లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునే వాళ్లకు క్లౌడ్ కిచెన్ ద్వారా ఆర్డర్స్ వెళ్తాయి. కోవిడ్ తర్వాత ఆన్ లైన్ ఆర్డర్స్ పెరిగిన విషయం తెలిసిందే. క్లౌడ్ కిచెన్ అంటే కస్టమర్లు నేరుగా ఇక్కడికి రారు. ఇది ఆన్ లైన్ ఆర్డర్ కోసం సంబంధించిన బిజినెస్. దీనికి డైన్ ఇన్ అవసరం లేదు. కిచెన్ లో కావాల్సిన వంట చేసి ఆన్ లైన్ ద్వారా కస్టమర్లకు డెలివరీ చేయాలి.

Business Idea : క్లౌడ్ కిచెన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి?
బిర్యానీలు, మీల్స్, కర్రీస్, రోటీస్.. ఇలా పలు రకాల ఐటెమ్స్ చేసి ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా కస్టమర్లకు పంపించడమే. ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటోతో టై అప్ అయితే.. ఆయా యాప్స్ ద్వారా బుక్ అయ్యే ఆర్డర్స్ కు క్లౌడ్ కిచెన్ ద్వారా పంపించి డబ్బులు సంపాదించుకోవచ్చు. కాకపోతే ఏరియా ఎక్కడ అనేది ముఖ్యం. రద్దీగా ఉండే ఏరియా అయితే ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి. క్లౌడ్ కిచెన్ ప్రారంభించడానికి కంపెనీ రిజిస్టర్ చేసుకొని ఫుడ్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ నుంచి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఉంటే చాలు. అలాగే.. ట్రేడ్ లైసెన్స్ కూడా ఉండాలి. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఆప్షనల్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెడితే చాలు. లక్షల్లో లాభాలు గడించవచ్చు.