Business Idea : ఆయిల్ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఏ ఫుడ్ వండాలన్నా ఆయిల్ కంపల్సరీ. అంటే.. ఫుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆయిల్ మీద ఆధారపడి ఉందన్నమాట. ఇది చాల పెద్ద ఇండస్ట్రీ. దీనికి ఉన్న డిమాండే వేరు. కాకపోతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి ఆయిల్ ను ఉత్పత్తి చేసే బిజినెస్ లు కాకుండా.. మిడిల్ క్లాస్ వాళ్లు కూడా వంటనూనెల బిజినెస్ ను పెట్టుకొని లక్షలు సంపాదించుకోవచ్చు.. అదెలాగో ఇప్పుడు చూద్దాం రండి.
ప్రస్తుతం దేశంలో వంటనూనెల ధరలు ఎలా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లీటర్ నూనె ప్యాకెట్ 200 కు పైనే ఉంది. ఈనేపథ్యంలో వంట నూనెలను కొనాలంటేనే పేద, మధ్య తరగతి ప్రజలు జడుసుకుంటున్నారు. ఎప్పటికీ డిమాండ్ ఉండే సెగ్మెంట్ కాబట్టి ఖచ్చితంగా దీని మీద పెట్టుబడులు పెట్టొచ్చు.. భారీగా లాభాలు గడించవచ్చు. ఈ సెగ్మెంట్ లో బిజినెస్ చేయాలని అనుకునేవారు తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లభాలు పొందొచ్చు. నూనె బిజినెస్ అనగానే చాలామంది పెద్ద పెద్ద మిషన్లు కావాలి అని అనుకుంటారు కానీ.. అవేమీ అవసరం లేదు.

Business Idea : పోర్టబుల్ నూనె మిషన్లను ఏర్పాటు చేసుకోవచ్చు
దాని కోసం పోర్టబుల్ మిషన్లు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. పెద్దగా ప్లేస్ కూడా అవసరం లేకుండా.. మ్యాన్ పవర్ అవసరం లేకుండా చిన్న ప్లేస్ లోనే ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసుకోవచ్చు. నూనె తీయడానికి గింజలను మాత్రం మార్కెట్ నుంచి ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకటి నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆయిల్ ఎక్స్ పెల్లర్ మిషన్ లను కొనుగోలు చేయొచ్చు. ఒక్కసారి ఆయిల్ మిల్ ను ఏర్పాటు చేసుకుంటే ఇక పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. తక్కువ పెట్టుబడితో నిరంతరం లాభాలు గడించే బెస్ట్ బిజినెస్ ఇది. ఎవర్ గ్రీన్ వ్యాపారం కాబట్టి.. దశాబ్దాల పాటు ఈ బిజినెస్ ను రన్ చేసుకొని లాభాలు పొందొచ్చు.