Business Idea : చాలామందికి ఉద్యోగాలంటే పడవు. 9 టూ 5 జాబ్స్ అంటే అస్సలు పడదు. కొందరికి సిటీల్లో ఉండటం కూడా నచ్చదు. మరికొందరికి గ్రామాల్లో ఉండి ఏదైనా చిన్న వ్యాపారం చేయాలనిపిస్తుంది. అటువంటి వాళ్లకు ఈ బిజినెస్ అయితే చాలా బెస్ట్. అదే మోదుగు పూల వ్యాపారం. నిజానికి మోదుగు పూలతో ఒక వ్యాపారం కూడా చేయొచ్చని ఎవ్వరికీ తెలియదు. అడవుల్లో, ఊళ్లలో ఎక్కడ చూసినా మోదుగు చెట్లు కనిపిస్తుంటాయి. వాటికి ఎర్రటి రంగులో కొన్ని పూలు పూస్తుంటాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ సమయంలో పూలు ఎక్కువగా పూస్తుంటాయి.
అందుకే ఆ పూలతో హోలీ రంగు తయారు చేసుకొని చాలామంది హోలీ వేడుకల కోసం వాడుతుంటారు. అంతకు మించి ఆ పూలను ఎవ్వరూ ఏం చేయరు. కానీ.. ఆ మోదుగు పూలతో వ్యాపారం చేయొచ్చు. లక్షలు సంపాదించవచ్చు. నిజానికి మోదుగు చెట్ల పూలే కాదు.. ఆకులు కూడా చాలా ఉపయోగపడతాయి. మోదుగు ఆకులతో విస్తార్లు కుట్టి వాటిని శుభకార్యాల్లో వాడటం చేస్తుంటారు. అయితే.. ఈ మోదుగు చెట్టుతో ఎలాంటి బిజినెస్ చేయాలంటే.. మోదుగు చెట్ల పువ్వులను విక్రయించి డబ్బులు సంపాదించవచ్చు. ఎందుకంటే మార్కెట్ లో మోదుగు పువ్వులకు చాలా డిమాండ్ ఉంటుంది.

Business Idea : ఈ చెట్లను సాగు చేసి లక్షలు సంపాదించుకోవచ్చు
బెరడు, కాండం, ఆకులకు కూడా డిమాండ్ ఉంటుంది. హోలీ సమయంలో పువ్వులకు చాలా డిమాండ్ ఉంటుంది. చాలామంది రైతులు వేరే పంటలను పండించినట్టే.. ఈ చెట్లను కూడా సాగు చేస్తున్నారు. లాభాలు గడిస్తున్నారు. ఒక ఎకరం పొలం ఉన్నా చాలు.. మోదుగు చెట్లను సాగు చేయొచ్చు. దాని కోసం పెద్దగా పెట్టుబడి కూడా ఉండదు. 50 వేలు పెట్టుబడి పెడితే చాలు. ఒక్కసారి చెట్టు నాటితే 30 ఏళ్ల వరకు ఆ చెట్ల నుంచి ఆదాయం పొందొచ్చు. ఆ చెట్లను నాటిన మూడేళ్లలో పూలు పూస్తాయి. హోలీ టైమ్ లో మోదుగు పూల నుంచి నాచురల్ రంగులను తయారు చేస్తారు. మోదుగు చెట్టు బెరడు, కాండాన్ని పలు కంపెనీలు ఆయుర్వేద మందుల కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటాయి. ఇలా మోదుగుతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే.. మోదుగు బిజినెస్ ను ఎంచుకుంటే లక్షల్లో సంపాదించుకోవచ్చు.