PPF : చాలామందికి పీపీఎఫ్ అకౌంట్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. నిజానికి పీపీఎఫ్ అకౌంట్ లో మనకు నచ్చినంత డిపాజిట్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ అకౌంట్ లో అయితే కంపెనీనే మన తరుపున కొంత శాతం డబ్బును డిపాజిట్ చేస్తుంది. అయితే.. పీపీఎఫ్ అకౌంట్ లో ఇటీవల కేంద్రం కొన్ని మార్పులు చేసింది. మీకు పీపీఎఫ్ అకౌంట్ ఉంటే ఈ వార్త మీకోసమే. నిజానికి.. 15 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు డిపాజిట్ చేయకున్నా పీపీఎఫ్ అకౌంట్ ను కంటిన్యూ చేయొచ్చు.
డబ్బులు డిపాజిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. లేదా పీపీఎఫ్ అకౌంట్ ను ఎక్సెటెన్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ పీపీఎఫ్ అకౌంట్ మీద 25 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. కాకపోతే పీపీఎఫ్ అకౌంట్ తీసిన తర్వాత రెండేళ్ల ముందు ఎంత డబ్బు డిపాజిట్ అయి ఉంటుందో ఆ డబ్బులో 25 శాతం మాత్రమే లోన్ తీసుకోవచ్చు.

PPF : పీపీఎఫ్ అకౌంట్ మీద 25 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు
పీపీఎఫ్ అకౌంట్ మీద తీసుకున్న లోన్ ను 2 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించారు. వడ్డీ కంటే ముందు ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాక.. వడ్డీని రెండు ఇన్ స్టాల్ మెంట్స్ లో పే చేసుకోవచ్చు. పీపీఎఫ్ అకౌంట్ ను ఓపెన్ చేయాలంటే ఫామ్ ఏ బదులు ఇప్పుడు పామ్ 1 ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పీపీఎఫ్ అకౌంట్ ను 15 ఏళ్ల తర్వాత ఒక సంవత్సరం మెచ్యూరిటీ అయిపోయాక, ఫామ్ హెచ్ కోసం అప్లయి చేయాల్సి ఉంటుంది. ఇదివరకు ఫామ్ 4 ఉండేది. ఒక సంవత్సరంలో కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. కానీ సంవత్సరానికి రూ.1.5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయకూడదు.