Business Idea : ఏదైనా బిజినెస్ పెడదామనుకుంటున్నారా….అయితే దీన్ని ట్రై చేయండి లక్షల్లో ఆదాయం

Advertisement

Business Idea : సొంత ఊర్లో లాభ సాటి వ్యాపారాన్ని మొదలెడదాం అనుకుంటున్నారా. అయితే నాటు కోడిగుడ్ల వ్యాపారం ఒక చక్కటి అవకాశం అని చెప్పాలి. మార్కెట్లో నాటు కోడిగుడ్లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆ వ్యాపారం గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఆర్గానిక్ ఉత్పత్తుల పైన అందరికీ అవగాహన పెరిగింది. అందువలన ఆర్గానిక్ పద్ధతిలో చేసిన కూరగాయలను మరియు పండ్లను అలాగే మాంసం తినేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. ప్రస్తుత కాలంలో ఆహార కలుషితం బాగా జరుగుతుంది దానివలన ప్రజలు ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే పౌల్ట్రీ పరిశ్రమలు రసాయనాలు అత్యధికంగా వాడుతున్నారు. అలాంటివి తినడం ద్వారా అనేక రకాల జబ్బులకు దారితీస్తుంది. కోడి మాంసం కూడా ఇలాగే కలుసితం అయిపోయింది.

Advertisement

దీంతో ఇప్పుడు ప్రజలు నాటు కోళ్లను తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీన్నే మనం వ్యాపారంగా మలుచుకుంటే మంచి లాభాలను గడించవచ్చు. దీని కోసం మీరు ముందుగా పెరట్లో ఒక ఆర్గానిక్ షెడ్ ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఇంటి వెనక ఏదైనా ఖాళీ స్థలం ఉంటే అందులో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ షెడ్ ను అతి తక్కువ ధరలోనే మనకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు. ఆ తర్వాత నాటు కోడిగుడ్లను మరియు నాటు కోళ్లను సేకరించి , కోళ్ల ఫామ్ ను స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంక్యుబేటర్ పద్ధతిలో కోడిగుడ్లను పిల్లలుగా మార్చుకోవచ్చు. దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ అని చెప్పాలి. నాటుకోడి విషయానికొస్తే ఈ కోళ్లు ఐదు నెలల తర్వాత నుంచి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తారు. వీటిలో కొన్ని గుడ్లను అమ్ముకోవడానికి మరికొన్ని గుడ్లను పిల్లలుగా మార్చుకునేందుకు ఉంచుకోవాలి.

Advertisement
Do you want to start any business... try this...
Do you want to start any business… try this…

కొన్ని కోళ్లను మాంసంకు విక్రయించుకోవచ్చు. లాభాలతో పాటు నష్టాలను కూడా దీంట్లో ఉంటాయి. కోళ్లకు మంచి ఆహారం అందించాలి. అలాగే వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. కోళ్లకు జబ్బులు వస్తూ ఉంటాయి వాటిని గమనించి వెంటనే చూపిస్తే ఆ జబ్బు వేరే కోళ్లకు రాకుండా ఉంటుంది. అలాగే వాటి సంరక్షణలో మనం జాగ్రత్తగా లేకుంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. కావున ఈ వ్యాపారాన్ని పెట్టాలి అనుకునేవారు ముందుగా ఈ వ్యాపారంలో అనుభవజ్ఞులైన వారిని కలిసి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మొదలుపెట్టడం మంచిది. ఎలాంటి అనుభవం లేకుండా దీనిని స్టార్ట్ చేస్తే నష్టపోవాల్సి ఉంటుంది జాగ్రత్త.

Advertisement