Business Idea : ఇంటి దగ్గరే ఉండి డోర్ మ్యాట్ బిజినెస్ చేసుకొని లక్షలు సంపాదించండి.. ఎలాగంటే?

Advertisement

Business Idea : చాలామందికి ఉద్యోగం కంటే కూడా ఏదైనా వ్యాపారం చేయాలని ఉంటుంది. అది ఏ వ్యాపారం అయినా సరే.. తక్కువ పెట్టుబడి ఉండాలి.. లాస్ రాకూడదు అని అందరూ అనుకుంటారు. నిజానికి పెట్టుబడి లేని వ్యాపారం ఉండదు. కానీ.. కాస్త తక్కువ పెట్టుబడి అయినా రాబడి బాగా వచ్చేలా.. నష్టం తక్కువగా ఉండే వ్యాపారాన్ని చూసుకోవడానికి చాలామంది ప్లాన్ చేస్తుంటారు. అటువంటి వాళ్లకు ఈ డోర్ మ్యాట్ బిజినెస్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ డోర్ మ్యాట్ బిజినెస్ ను ఎలా ప్రారంభించాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

Advertisement

ప్రతి ఇంట్లో ఖచ్చితంగా డోర్ మ్యాట్ ఉండాల్సిందే. డోర్ మ్యాట్స్, కార్పెట్స్ లేని ఇల్లు ఉండదు. అదే మీ బిజినెస్ కు పెట్టుబడి అవుతుంది. ఎలాంటి పెట్టుబడి లేకున్నా.. కేవలం క్లాత్ వేస్ట్ తోనూ ఈ డోర్ మ్యాట్స్ ను తయారు చేయొచ్చు. డోర్ మ్యాట్స్ కు ఎవ్వరూ వేలు ఖర్చు పెట్టరు. తక్కువ ధరలో దొరికితే చాలు అనుకుంటారు. అందుకే.. తక్కువ పెట్టుబడితో డోర్ మ్యాట్స్ ను తయారు చేసి తక్కువ ధరకే మార్కెట్ లో అమ్మితే వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ బిజినెస్ కోసం కావాల్సిన రా మెటీరియల్ కేవలం క్లాత్ స్క్రాప్. క్లాత్ వేస్ట్ ను ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు.

Advertisement
door mats business is better to earn lakhs of rupees
door mats business is better to earn lakhs of rupees

Business Idea : రూ. 15 వేల నుంచి 20 వేల పెట్టుబడి పెట్టినా చాలు

టెక్స్ టైల్స్ షాపులలో, ఫ్యాక్టరీస్ లో కొనుగోలు చేయొచ్చు. ఇక.. డోర్ మ్యాట్ ను తయారు చేయడానికి కావాల్సిన మిషన్ కు పెద్దగా ఖర్చేమీ కాదు. రూ.15 వేలకే మార్కెట్ లో ఈ మిషన్ ను కొనుగోలు చేయొచ్చు. ఇంటి దగ్గరే మిషన్ ను ఏర్పాటు చేసుకొని డోర్ మ్యాట్స్ తయారు చేయొచ్చు. రోజూ ఒక 20 డోర్ మ్యాట్లు తయారు చేసినా.. కనీసం రెండు వేల వరకు సంపాదించవచ్చు. అంటే నెలకు కనీసం 50 వేల రూపాయలు ఎటూ పోవు. ఖర్చులు పోను కనీసం ఒక 30 వేలు అయినా మిగులుతుంది. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్, మాల్స్ లాంటి వాటితో ఒప్పందం కుదుర్చుకుంటే రోజూ ఎక్కువ సంఖ్యలో డోర్ మ్యాట్స్ ను సప్లయి చేయొచ్చు. డైరెక్ట్ గానూ సేల్స్ చేసుకోవచ్చు. దీని కోసం లోకల్ గా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. ఎంఎస్ఎంఈలో ఈ వ్యాపారానికి రిజిస్టర్ చేసుకుంటే కేంద్రం నుంచి సబ్సిడీ కూడా లభిస్తుంది.

Advertisement