Business Idea : వ్యాపారం చేయాలంటే అంత ఈజీ కాదు. చాలా కష్టపడాలి. పెట్టుబడి పెట్టాలి. లాస్ వచ్చినా భరించే శక్తి ఉండాలి. సహనం ఉండాలి. అన్నీ కలిస్తే వ్యాపారం కలిసి వస్తుంది. ఏమాత్రం తేడా కొట్టినా వ్యాపారం ముందుకెళ్లడం చాలా కష్టం. అయితే.. కొన్ని సీజన్లలోనే చేసే వ్యాపారాలు కూడా ఉంటాయి. ఆ వ్యాపారాల వల్ల లక్షలు సంపాదించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి. తక్కువ టైమ్ లో ఎక్కువ డబ్బులు సంపాదించే టెక్నిక్ ఇది. ఇంకో సంవత్సరంలో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రానున్నాయి. ఈనేపథ్యంలో ఈ ఎన్నికలతో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది.
అదెలా.. అసలు ఎన్నికలు వస్తే డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు అనే ప్రశ్న మీకు రావచ్చు. ఎన్నికలు వచ్చాయంటే చాలామంది ఎన్నికల కోసం కొన్ని వస్తువులను తయారు చేస్తుంటారు. ఎన్నికల సమయంలో ప్రచారం కోసం వాడే వస్తువులు, పార్టీ జెండాలకు చాలా డిమాండ్ ఉంటుంది. అందుకే.. ఏ పార్టీలు అక్కడ పోటీ చేస్తున్నాయో తెలుసుకొని వాటికి సంబంధించిన జెండాలు, వస్తువులు, పార్టీ లోగోలు తయారు చేసే కాంట్రాక్ట్ ను తీసుకోవచ్చు. చాలా పార్టీలు పోస్టర్లు, బ్యానర్లు కూడా తయారు చేయించుకుంటాయి. అలాగే ఈ మధ్య సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా ఎక్కువయింది. ఈనేపథ్యంలో ఎన్నికల ప్రచారం కోసం వస్తువుల కాంట్రాక్ట్ తీసుకోకపోయినా వాటిని తయారు చేసి మీరే అమ్ముకోవచ్చు.

Business Idea : పోస్టర్లు, బ్యానర్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా అవసరమే?
మీకు సోషల్ మీడియాలో కాస్తో కూస్తో అవగాహన ఉంటే ఏదైనా ఒక పార్టీ తరుపున సోషల్ మీడియాలో ప్రచారం చేయొచ్చు. ఎన్నికల ప్రచారం కోసం పార్టీలు బాగానే ఖర్చు పెడతాయి. ఇలా.. పార్టీ ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెడతారు. దాన్ని క్యాష్ చేసుకొని పార్టీకి ఏవిధంగా ప్రచారం చేయాలో అలా చేసి ఎన్నికల సమయంలో లక్షలు సంపాదించేవాళ్లు బోలెడు మంది ఉన్నారు. బోలెడు కంపెనీలు ఉన్నాయి. వాటి పని ఎన్నికల సమయంలో ఒక పార్టీ తరుపున అన్ని కార్యక్రమాలు చూసుకోవడం. అలాంటిది ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుంటే ఎన్నికల సమయంలో ఒకేసారి జాక్ పాట్ కొట్టొచ్చు. లక్షలు సంపాదించవచ్చు.