Business Idea : చాలామంది ఏదో ఒక బిజినెస్ చేయాలని అనుకుంటారు కానీ.. ఏ బిజినెస్ చేయాలో మాత్రం తెలియదు. అదే కదా ట్విస్ట్ అంటే. అందరూ బిజినెస్ చేయాలంటే కుదరదు. కొందరికి ఇంట్రెస్ట్ ఉన్నా.. ఎలా చేయాలో తెలియదు. ఏం బిజినెస్ చేయాలో తెలియదు. అందుకే.. కొందరు ఆదిలోనే బిజినెస్ ఐడియాను వదిలేస్తుంటారు. మరికొందరు అయితే రిస్క్ ఎందుకు అని అనుకొని ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ తమ జీవితాన్ని అలా సాగిస్తూ ఉంటారు. కానీ.. బిజినెస్ లో రిస్క్ తో పాటు ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక్కసారి బిజినెస్ క్లిక్ అయిందంటే ఇక అంతే.. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.
అందులో ఒకటి ఈ ఎలక్ట్రిక్ తందూర్ మిషన్లు. ఈ మధ్య భారీ యంత్రాలకు బదులు చాలా తక్కువ సైజులో పోర్టబుల్ మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. అన్ని ఎలక్ట్రిక్ వస్తువులు కూడా చిన్న సైజులో అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ తందూర్ మిషన్. ఇది చిరు వ్యాపారులకు బెస్ట్ బిజినెస్. తందూర్ అంటే తెలుసు కదా. బయటి ఫుడ్ ఎక్కువగా తినేవాళ్లకు తందూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తందూరీ రోటీలు, తందూరీ చికెన్, తందూరీ మటన్.. ఇలా తందూరీ స్పెషల్ వంటకాలు చాలానే ఉంటాయి. చూడటానికి మైక్రోఓవెన్స్ లా ఉన్నా తందూర్ మిషన్లు ఇంకా తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. సాధారణంగా తందూరీ వంటకాలను బొగ్గు మీద కాల్చుతారు.

Business Ideas : తందూర్ మిషన్ తో ఏం చేయాలి? ఎలా బిజినెస్ చేయాలి?
తందూరీ చికెన్ అంటే బొగ్గు మీద కాల్చి ఇస్తారు. అలాగే తందూరీ వంటకాలు ఏవైనా అలా బొగ్గు మీద కాల్చి ఇస్తారు. కానీ.. బొగ్గు అవసరం లేకుండా ఎలక్ట్రిక్ తందూర్ మిషన్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఈ మిషన్ల ద్వారా నాన్ వెజ్, వెజ్ వంటకాలు, పిజ్జాలు, రోటీలు, పరోటాలు, ఇలా అన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చు. మరి.. ఈ మిషన్లతో ఏ బిజినెస్ చేయొచ్చు అంటే.. పిజ్జా సెంటర్ పెట్టుకోవచ్చు. లేదా తందూరీ వంటకాల సెంటర్ పెట్టుకోవచ్చు. లేదంటే క్లౌడ్ కిచెన్ పెట్టుకొని ఆన్ లైన్ లో వంటకాలను డెలివరీ చేయొచ్చు. చిన్న రెస్టారెంట్ ను కూడా ఓపెన్ చేయొచ్చు. ఒక్క మిషన్ ఐదు వేల రూపాయల కంటే ఎక్కువగా ఉండదు. సెమీ ఆటోమెటిక్ అయితే తక్కువ ఖరీదు ఉంటుంది. ఆటోమెటిక్ తందూర్ మిషన్ అయితే కాస్త రేట్ ఎక్కువగా ఉంటుంది. ఒకటిరెండు మిషన్లను కొనుక్కొని ఎటువంటి ఫుడ్ బిజినెస్ పెట్టుకున్నా.. నెలకు లక్షలు సంపాదించవచ్చు.