Business Idea : చాలామంది జాబ్ కంటే కూడా బిజినెస్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తారు. జాబ్ అంటే ఒకరి కింద పనిచేయాలి. బిజినెస్ అంటే మన కాళ్ల మీద మనం నిలబడొచ్చు. కాకపోతే రిస్క్ ఎక్కువ. పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ బిజినెస్ లో లాస్ వస్తే డబ్బులన్నీ పోతాయి. మళ్లీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే చాలామంది బిజినెస్ అంటేనే భయపడిపోతారు. కానీ.. కొన్ని రకాల బిజినెస్ లు చేస్తే ఖచ్చితంగా లాభం వస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటో తెలుసుకుందాం రండి.
ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది తేనె. కానీ.. ఈరోజుల్లో స్వచ్ఛమైన తేనె కావాలంటే దొరకడం కష్టమే. మార్కెట్ లో దొరికే పలురకాల తేనెల్లో ఏం కలుస్తుందో తెలియదు. డాక్టర్లు తేనె తాగాలని సూచిస్తుంటారు కానీ.. స్వచ్ఛమైన తేనె ఎక్కడ దొరుకుతుంది. అందుకే.. తేనె వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. కేంద్రమే కాదు.. రాష్ట్రాలు కూడా సబ్సిడీ ఇస్తున్నాయి. ఎక్కడైనా ఈ బిజినెస్ ను స్టార్ట్ చేయొచ్చు. దాని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.

Business Idea : ప్రభుత్వం నుంచే 80 నుంచి 85 శాతం వరకు సబ్సిడీ
నాబార్డ్ తో కలిసి నేషనల్ బీ బోర్డ్ అనే సంస్థ ఇండియాలో తేనెటీగల పెంపకం కోసం ఆర్థిక సాయం అందిస్తోంది. దానికి ప్రభుత్వమే 80 నుంచి 85 శాతం వరకు సబ్సిడీని అందిస్తోంది. కేవలం 10 నుంచి 15 పెట్టెలతో తేనెటీగల వ్యాపారం చేయొచ్చు. ఒక పెట్టె నుంచి కనీసం 40 కిలోల తేనె లభిస్తుంది. 10 పెట్టెలు కలిపి కనీసం 400 కిలోల తేనె లభిస్తుంది. ఒక్క కిలో రూ.350 కి అమ్మినా కూడా కనీసం లక్షన్నర ఆదాయం వస్తుంది. ఈ బిజినెస్ కోసం పెట్టే ఖర్చు కేవలం రూ.35 వేలు అవుతుంది. పెట్టుబడి పోగా లక్ష రూపాయల వరకు లాభం అర్జించవచ్చు. ఇంకా ఎక్కువ పెట్టెలను ఏర్పాటు చేసుకుంటే లాభం పెరుగుతుంది.