Business Idea : చాలామంది ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలని అనుకుంటారు. ఈ జాబ్స్ కంటే బిజినెస్ బెటర్ అని అనుకుంటారు. అటువంటి వాళ్లు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే బిజినెస్ ల వైపు మొగ్గు చూపొచ్చు. తక్కువ పెట్టుబడి పెట్టి నెలకు లక్షలు సంపాదించే బిజినెస్ లు చాలా ఉన్నాయి. అందులో ఒకటి నర్సరీ బిజినెస్. వర్షాకాలం ప్రారంభం కాగానే ఈ బిజినెస్ ను చాలా మంది స్టార్ట్ చేస్తుంటారు. చాలా సింపుల్ బిజినెస్, పెట్టుబడి తక్కువ దీనికి. మరి.. ఈ బిజినెస్ ను ఎలా చేయాలి.. ఎలా డబ్బులు సంపాదించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు నర్సరీలు అంటే పట్టణాల్లోనే కనిపించేవి.
కానీ.. ఇప్పుడు మాత్రం నర్సరీలు అంటే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. గ్రామాల్లోనూ నర్సరీలు కనిపిస్తున్నాయి. చెట్లను పెంచడం వల్ల కలిగే లాభాలు, ప్రయోజనాల గురించి అందరికీ తెలియడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు మొక్కలు పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈనేపథ్యంలో మొక్కల కొనుగోళ్లు పెరిగాయి. అందుకే నర్సరీలకు ప్రస్తుతం డిమాండ్ ఉంది. నర్సరీలను ఏర్పాటు చేసి ఈరోజుల్లో నెలకు సింపుల్ గా రూ.50 వేల నుంచి లక్ష వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. నర్సరీల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ పథకం కింద ఆర్థిక సాయం పొందొచ్చు. ప్రతి సంవత్సరం కేంద్రం రూ.6 లక్షల నిధులను మంజూరు చేస్తుంది.

Business Idea : నర్సరీల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం
కాబట్టి.. నర్సరీని ఏర్పాటు చేయాలనుకునే వాళ్లు కనీసం తమ నర్సరీలో 50 వేల మొక్కలను పెంచాలి. నెలకు ఒక్కో మొక్కకు రూపాయి చొప్పున అన్ని మొక్కలకు కలిపి రూ.50 వేలు మంజూరు అవుతాయి. అయితే.. రైతులకు ముందుగా నర్సరీల ఏర్పాటులో ప్రాధాన్యత కల్పిస్తారు. నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని నర్సరీలను ఏర్పాటు చేసుకోవచ్చు. నర్సరీలలో ఎక్కువగా పూల మొక్కలు, కురగాయలు, పండ్ల మొక్కలను పెంచితే బాగా డిమాండ్ ఉంటుంది. పలు రకాల పూల మొక్కలు, పలు రకాల పండ్ల మొక్కలు, పలు రకాల కూరగాయల మొక్కలను పెంచాలి. ఔషధ మొక్కలను కూడా పెంచొచ్చు. మొక్కను బట్టి మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ ఆధారంగా నర్సరీల ద్వారా ప్రతి నెల లక్షల ఆదాయం పొందొచ్చు.