Business Idea : కేవలం 15 వేలు పెట్టుబడి పెట్టండి.. నెలనెలా లక్షల్లో సంపాదించుకోండి.. అది ఏ బిజినెస్ అంటే?

Advertisement

Business Idea : ఉద్యోగమా.. బిజినెస్సా.. 9 టు 5 జాబ్ చేయాలా.. లేక సొంతంగా బిజినెస్ పెట్టుకొని 10 మందికి ఉపాధి అందించాలా.. ఇలా చాలామంది తర్జన భర్జన పడుతుంటారు. అయితే.. నూటికి 90 మంది ఉద్యోగం వైపే మొగ్గు చూపుతారు. దానికి కారణం.. వాళ్లకు రిస్క్ చేసే ఇష్టం ఉండదు. ఉద్యోగంలో అంతగా రిస్క్ ఉండదు కానీ.. సొంత బిజినెస్ అంటే చాలా కష్టపడాలి. లాస్ వచ్చినా భరించాలి.. ఎన్నో టెన్షన్స్.. ఇలా అన్ని పనులు మనమే సొంతంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత కష్టపడ్డా.. చివరకు లాభాలు వస్తాయో రావో కూడా తెలియదు. కానీ.. పక్కాగా ప్లాన్ చేసుకొని చిన్న చిన్న బిజినెస్ లు చేసుకుంటూ లక్షలు సంపాదించవచ్చు అనే విషయం మీకు తెలుసా? దాని కోసం పెద్దగా పెట్టుబడి కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. కేవలం రూ.15 వేల పెట్టుబడి పెడితే చాలు.. నెలకు లక్షలు సంపాదించుకునే సువర్ణ అవకాశం. ఇంకెందుకు ఆలస్యం… ఆ బిజినెస్ ఏదో తెలుసుకుందాం రండి.

Advertisement

బెస్ట్ బిజినెస్ లలో ఒకటి రీసైక్లింగ్ బిజినెస్. రీసైక్లింగా అని ఛీప్ గా తీసిపారేయకండి. రీసైక్లింగ్ బిజినెస్ గురించి అసలు నిజాలు తెలిస్తే మీరు ఇలా ఈ బిజినెస్ ను తక్కువగా చూడరు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో మన దేశంలో నుంచే సుమారు 300 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇంత భారీ చెత్తను ప్రాసెసింగ్ చేయడం చాలా కష్టం. అందులో అవసరమైన వాటిని రీసైక్లింగ్ చేసి చాలా మంది లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. పనికి వచ్చే వాటిని రీసైక్లింగ్ చేసుకొని తిరిగి అమ్ముకొని లాభాలు గడించవచ్చు.

Advertisement
recycling business is best to earn more money as self business
recycling business is best to earn more money as self business

Business Idea : వ్యర్థాలను సేకరించడం ఎలా?

వ్యర్థాలను సేకరించడం కోసం మీరు చేయాల్సింది ఒకటే. మీ చుట్టూ ఉండే వ్యర్థాలను సేకరించాల్సి ఉంటుంది. అలాగే చెత్తను సేకరించే వాళ్లు, తొలగించే వారి నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు. లేదంటే పంచాయతీలు, మున్సిపల్ కౌన్సిల్ నుంచి కూడా వ్యర్థాలు సేకరించవచ్చు. చెత్తను సేకరించిన తర్వాత దాన్ని శుభ్రం చేసుకొని వాటి ద్వారా రకరకాల వస్తువులను తయారు చేయొచ్చు. ఈ వస్తువులను అన్నింటినీ నేరుగా లేదంటే ఆన్ లైన్ లో విక్రయించవచ్చు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్రా లాంటి ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ లలో అమ్ముకోవచ్చు. అలా ఈ కామర్స్ సైట్లలో అమ్మే రీసైక్లింగ్ వస్తువులకు చాలా డిమాండ్ ఉంటుంది. కేవలం చెత్తను సేకరించడం కోసం, దాన్ని ప్రాసెస్ చేయడం కోసం కొంత ప్లేస్ ఉంటే చాలు.. నెలకు లక్షలు జేబుల్లో వేసుకోవచ్చు.

Advertisement