Business Idea : చాలామంది బిజినెస్ చేయాలని చూస్తుంటారు. తక్కువ పెట్టుబడితో ఏదో ఒకటి చిన్న బిజినెస్ చేయాలని కలగంటారు. కానీ.. ఏ వ్యాపారం చేయాలో వాళ్లకు అర్థం కాదు. అటువంటి వాళ్లకు ఈ కథనం బాగా ఉపయోగపడుతుంది. ఏ బిజినెస్ అయినా సరే.. ముందు చిన్నగానే ప్రారంభించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అది పెద్దస్థాయిలోకి వెళ్తుంది. అలా చిన్నగా ప్రారంభమై నేడు కోట్ల టర్నోవర్ తో నడుస్తున్న ఎన్నో కంపెనీలను మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. కొన్ని వ్యాపారాలను ఇంట్లోనే నిర్వహించుకోవచ్చు. దాని కోసం తక్కువ పెట్టుబడే అవసరం అవుతుంది.
అలా తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేయాలనుకుంటే అందులో నెంబర్ వన్ స్థానంలో నిలిచేది కాస్ట్యూమ్ జ్యూవెలరీ బిజినెస్. ఈ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. ఫ్యాషన్, స్టయిల్ లాంటి అంశాలకు నేటి యూత్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా యువతులు అయితే కాస్ట్యూమ్ జ్యూవెలరీని బాగా ఇష్టపడతారు. అందుకే మన దగ్గర కాస్ట్యూమ్ జ్యూవెలరీకి ఎక్కువ డిమాండ్ ఉంది. దీని కోసం హోల్ సేల్ మార్కెట్ లో జ్యూవెలరీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాటిని డైరెక్ట్ గా లేదా ఆన్ లైన్ లో సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటూ కస్టమర్లకు అమ్ముకోవచ్చు.

Business Ideas : గ్రీన్ టీ వ్యాపారం కూడా బెటరే
చాలామంది ఇప్పుడు గ్రీన్ టీని ప్రిఫర్ చేస్తున్నారు. గ్రీన్ టీ ప్యాక్స్, గ్రీన్ టీ పౌడర్ ను హోల్ సేల్ మార్కెట్ లో కొనుగోలు చేసి కస్టమర్లకు అమ్ముకోవచ్చు. మొబైల్ యాక్సెసరీస్, లెదర్ బ్యాగ్స్, టిఫిన్ సర్వీసులు, సోలార్ ప్రాడక్ట్స్ తయారీ, హెర్బల్ ప్రాడక్ట్స్ ఇలా… పలు చిన్న వ్యాపారాలను స్టార్ట్ చేసుకోవచ్చు. వాటి కోసం పెద్దగా పెట్టుబడి ఏం ఉండదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చు. అందుకే… ఏదైనా బిజినెస్ చేయాలనుకునే వాళ్లు.. చిన్న చిన్న జాబ్స్ తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లాభాలు వాటంతట అవే వస్తాయి.