Categories: devotionalNews

Lakshmi Anugraham : శ్రీలక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి ఏం చేయాలి ?

Lakshmi Anugraham : లక్ష్మీ.. శ్రీలక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి అనేది చాలామందికి సందేహం. లక్ష్మీ అనుగ్రహం ఉంటే సకల సంపదలు, సకల కార్యాలు దిగ్విజయం అవుతాయి. అయితే ఆ తల్లి అనుగ్రహానికి ఏం చేయాలో పండితులు చెప్పిన విశేషాలు … తెలుసుకుందాం… శుక్రవారం ప్రాతఃకాలంలో శ్రీమహాలక్ష్మీకి పూజ చేయాలి. పూజలో తులసీ పత్రాన్ని, తులసి మంజరిని సమర్పించండి. సాధనా, పూజా, ప్రార్థనా సమయంలో మీ ముఖం తూర్పువైపు, లేదా పశ్చిమం వైపునకు అయినా ఉండాలి. ప్రతి శనివారం ఇంటిని శుభ్రపరచుకోవాలి. సాలెగూళ్ళు, మట్టి, చెత్త, విరిగిపోయిన వస్తువుల్ని సర్ది శుభ్రం చేయాలి.

Lakshmi Anugraham ఇంటి సింహద్వారం దగ్గర లోపలి

మీ ఇంటి సింహద్వారం దగ్గర లోపలి వైపు శ్రీగణేశుడిని ఉంచండి. ఆయన ముఖం మీ ఇంటిని చూస్తున్నట్టు ఉండాలి. దిశను గురించి పట్టించుకోన అవసరం లేదు. ఆయనకు ప్రాతఃకాలమే గరికను సమర్పించుకోవాలి.అదేవిధంగా శ్రీలక్ష్మీసూక్తం అంటే శ్రీసూక్తం అది రాని వారు కనీసం లక్ష్మీ అష్టోతరం ప్రతినిత్యం చదువుకోవడం చాలా మంచి ఫలితాన్నిస్తుంది. అదేవిధంగా లక్ష్మీదేవి కూర్చున్న ఫోటో ఇంట్లో పెట్టుకొని నిత్యం అక్కడ పుష్పాలను వీలైతే కమాలు లేదా గులాబీలను లేదా మందారం పెట్టడం, ధూపం వేయడం చేయాలి.

Lakshmi Anugraham : శ్రీలక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి ఏం చేయాలి ?

ఏ మంత్రం శ్లోకం రాకున్నా ‘’నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే’’ అనే శ్లోకాలను చదువుకోవాలి. అదిరాకుంటే ‘’ఓం శ్రీ మహాలక్ష్మీయైనమః’’ అనేనామాన్ని భక్తి, శ్రద్ధతో కనీసం 108 సార్లు జపం చేయండి. తప్పక అనతి కాలం అంటే శ్రీఘ్రంగా మీయందు లక్ష్మీదేవికి కరుణ కలిగి మిముల్ని అనుగ్రహిస్తుంది. సకల శుభాలను కలిగిస్తుంది.

tech desk

Share
Published by
tech desk

Recent Posts

శివుడి జన్మ ఎలా జరిగింది..!

లార్డ్ శివ త్రిలోకాలకు అధిపతి ఆదిదేవుడు అంటారు. ఎందుకంటే శివున్ని యూనివర్సిటీలో ఉన్న ఏ శక్తి కూడా ఎదిరించలేదు అని…

1 year ago

వినాయకుడి పుట్టుకలో ఉన్న అసలు నిజాలు…!

ఈ వినాయక చవితి సందర్భంగా గణనాథ అనే పేరు వెనుకున్న కథ తెలుసుకుందాం.. అయితే ఈ కథను చిన్నప్పటి నుంచి…

1 year ago

Hello world!

Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!

2 years ago