Basikam : వివాహ సమయంలో నుదుటన బాసికను ఎందుకు కడతారో తెలుసా…

Advertisement

Basikam : హైందవ సాంప్రదాయం ప్రకారం పెళ్లికి చాలా ప్రాధాన్యత ఉంది. అ పెళ్లి లోని ఆచార సంప్రదాయాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో పెరిగిన టెక్నాలజీ వల్ల ఎంతోమంది కొత్త పద్ధతులలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఎన్ని మార్కులు వచ్చిన సరే కొన్ని మాత్రం తప్పనిసరిగా అనాది నుంచి ఇప్పటివరకు వస్తూనే ఉన్నాయి. వాటిలో ఎంతగానే ప్రాముఖ్యమైనవి తాళి, బాసికం ,తలంబ్రాలు.ఇక విదేశాల్లో సెటిల్ అయినా వారు అయిన సరే సాధ్యమైనంతవరకు మన సాంప్రదాయాలకు విలువ ఇచ్చి అలాగే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇక మన సాంప్రదాయం ప్రకారం పెళ్లిలో అతి ముఖ్యమైన ఘట్టం వరుడు వధువుకి బాసికం కట్టడం.

Advertisement

బాసికం అనేది కేవలం అలంకారం కోసం మాత్రం కాదు. ఈ ఆచారం వెనుక శాస్త్రీయపరమైన కొన్ని కారణాలు అలాగే లాభాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. అయితే ఈ బాసికం కట్టడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మన శరీరంలో మొత్తం 72 నాడులు ఉంటాయి. అందులో 14 నాడులు చాలా ముఖ్యమైనవి. ఇవి మన శరీరాన్ని అన్నివేళలా చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. ఇక వీటిలో పింగళ,సుషుమ్మ, ఇడ అనేవి ముఖ్యమైనవి అని పూర్వికులు నమ్మకం.సుషుమ్మ అనబడే నాడికి సూర్యనాడి కుడి పక్కన ఉంటుంది. అలాగే ఎడమ వైపు చంద్రనాడి ఉంటుంది.మన నుదుటన ఈ రెండు నాడులు కలవడం వలన ఒక అర్థ చంద్రాకారం ఏర్పడుతుంది.

Advertisement
.Do you know why we tie "basikam" on forehead during marriage
.Do you know why we tie “basikam” on forehead during marriage

మన వేదాల ప్రకారం ఋషులు దీన్ని దివ్యచక్షువు అని అంటారు.అయితే నుదుట భాగాన బ్రహ్మ కొలువుంటాడు అని పెద్దల నమ్మకం. అందుకే వివాహం లాంటి శుభకార్యాలు జరిగే సమయంలో పరుల దృష్టి ఈ దివ్యచక్రంపై పడకుండా ఉండడానికి అడ్డుగా బాసికం నుదుటికి కడతారు.ఇలా చేయడం వల్ల కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు ,సుఖ సంతోషాలతో కలిసి ఉంటారని పెద్దల నమ్మకం. అందుకే బాసికలు అర్థ చంద్రకారం ,త్రిభుజాకారం లేదా చతురస్రకారంలోనే ఉంటాయి. వీటిని కట్టుకోవడం వల్ల అంత ప్రయోజనం ఉంది కాబట్టే ఇవి ఇంకా కొనసాగుతూ వస్తున్నాయి.

Advertisement