Solar Eclipse : సూర్య గ్రహణానికి 12 గంటల ముందే సూతకం అనేది ప్రారంభమవుతుంది. ఇక సూతకం మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు అశుభ సమయంగా భావిస్తారు. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పూజలు కార్యక్రమాలు జరిపించరు. తినడం తాగడం కూడా నిషేధమే. గ్రహణం ప్రారంభమైన వెంటనే ఆలయాలన్నిటిని మూసేస్తారు. గ్రహణం ముగిసేంతవరకు ఆలయాలను అలాగే ఉంచుతారు. అయితే గ్రహణానికి ముందే తులసి ఆకులను ఆహారం పానీయాల్లో ఉంచుతారు. హిందూ మతంలో తులసి ఆకుకు చాలా ప్రాముఖ్యత ఉంది. తులసి మొక్కను భగవంతునిగా పూజిస్తారు. ప్రతి ఒక్కరి ఇంటి ఆవరణలో తులసి మొక్కను నాటి ప్రతిరోజు ఉదయం పూజిస్తారు.
దీని ద్వారా తెలుసుకోవచ్చు తులసి ఆకుకు ఎంత ప్రాముఖ్యత ఉందో. అలాగే శుభకార్యాలలో కూడా తులసి ఆకుకూ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాగే దేవుళ్లకు నైవేద్యం సమర్పించే సమయంలో కూడా ఈ తులసి ఆకులను కచ్చితంగా వేస్తారు. ఇక ఈసారి దీపావళి తర్వాత సూర్యగ్రహణం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ గ్రహణం మంగళవారం అక్టోబర్ 25న ఏర్పడనుంది. గ్రహణం మంగళవారం అక్టోబర్ 25న ఏర్పడబోతుంది.ఇక ఆరోజు ఆహారం పానీయాలను స్వచ్ఛత కాపాడుకునేందుకు తులసి ఆకులను వేసుకుంటారు. కానీ సూర్య గ్రహణానికి రెండు రోజులు ముందు తులసిని తాకకూడదని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆ ఆకులను తెంపడం అరిష్టమని చెబుతున్నారు. అలాగే తులసి చెట్టును పూజించడం కూడా చేయకూడదు. తులసి చెట్టును ముట్టుకోకూడదు.

సూర్య గ్రహణానికి రెండు రోజులు ముందు తులసి ఆకులను తెంపడం బ్రహ్మాను చంపిన పాపము కిందికి వస్తుందని శాస్త్రం నిపుణులు తెలియజేస్తున్నారు. అంటే అక్టోబర్ 23 ఆదివారం నుండి తులసి ఆకులను ముట్టుకోకూడదు. ఈ రెండు రోజుల్లో తులసిని ముట్టుకున్నట్లయితే మహా పాపమును మూట కట్టుకున్న వారు అవుతారు. కావున ఈ రెండు రోజులు తులసి ఆకులను తులసిని ముట్టుకోకుండా ఉండటం మంచిది. సూర్య గ్రహణం ముగిసిన తర్వాత అన్ని పనులను యధాతధిగా చేసుకోవచ్చు. కావున ఈ రెండు రోజులు తులసి కోటకు పూజ చేయకుండా ఉండటం మంచిది.