Dussehra : తొమ్మిది రాత్రుల నిరంతర యుద్ధం తర్వాత దుర్గాదేవి మహిషాసురుని చంపింది. చెడుపై మంచి, విజయాన్ని సాధించిన సందర్భంగా విజయదశమిని జరుపుకుంటాం. శరన్ననవరాత్రుల లో భాగంగా భక్తులు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను తొమ్మిది రోజులు పూజిస్తారు.దీనిలో నవమినాడు దేవతను మహిషాసురమర్దిని గా పూజిస్తారు.మహా నవమిని హిందూ క్యాలెండర్ ఆధారంగా అశ్విని , శుక్ల పక్షం 9వ రోజున జరుపుకుంటారు.*ఆయుధ పూజ ఆయుధ పూజను శాస్త్ర పూజ మరియు అస్త్రపూజ అని పిలుస్తారు. ఆయుధ పూజను నవమి రోజున జరుపుతారు.
ఈ రోజున చారిత్రాత్మకంగా తమ తమ ఆయుధాలను పూజిస్తారు. కాలక్రమేనా ఈ ఆయుధ పూజ కాస్త వాహన పూజగా మారింది.ఈ రోజున వాహనాలను శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో పూజిస్తారు.అదే పూర్వకాలంలో అయితే ఈ రోజున ,రోజువారు పని చేసే ఆయుధాలను తీసుకొచ్చి పూజించేవారట. అలాగే దక్షిణ భారతదేశంలో కళాకారులు వాయిద్యాలకు ఆయుధ పూజ చేసేవారు.* ఆయుధ పూజ – అక్టోబర్ 4 ,2022 మంగళవారం. *ఆయుధ పూజ వ్యవధి – 48 నిమిషాలు. *మహానవమి గొప్పతనం.ఈ రోజున అమ్మవారిని మహిషాసురమర్దినిగా పూజిస్తారు.

మహిషాసురుడు అనే రాక్షసుడిని ఓడించడానికి ముందు వచ్చే రోజును నవమి చివరి రోజుగా భావిస్తారు .ఇదే రోజున దుర్గామాత కైలాస పర్వతం నుండి భూమిని సందర్శించడానికి వస్తుందని నమ్ముతారు.ఈ సందర్భంగా భక్తులు దుర్గాదేవి విగ్రహాలను మండపాలలో పెట్టి పూజిస్తారు.అలాగే అనేక ప్రాంతాలలో అష్టమి మరియు నవమి నాడు కన్య పూజను జరుపుతారు.ఈ పూజలో 9 మంది చిన్నారులను దుర్గామాతగా భావించి తొమ్మిది రూపాలుగా పూజిస్తారు.అలాగే ఈ తొమ్మిది రోజులు పూలతో బతుకమ్మను తయారుచేసి పిల్లలు , పెద్దలు బతుకమ్మతో ఆడుతారు.ఇది తెలంగాణలో బాగా ప్రసిద్ధి.ఇక మహిషాసురమర్దిని శ్లోకంతో ఈ పూజలను ముగిస్తారు.మహిషాసురమర్దిని శ్లోకంతో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం వలన మంచి జరుగుతుందని నమ్మకం.