Zodiac Signs : అక్టోబర్ నెల, 2022, మేషరాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేష రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మేషంలో రాహువు, మిధునంలో కుజ, చంద్రులు ఉన్నారు. అలాగే కన్యా రాశిలో రవి, బుధ, శుక్రులు ఉన్నారు. తులారాశిలో కేతువు అలాగే మకర రాశిలో వక్రించిన శని, మీన రాశిలో వక్కించిన గురువు ఉన్నారు. ఇక ఈ వారంలో చంద్రుడు మిధున రాశి నుంచి కన్యారాశులోకి వచ్చి ఉన్నాడు. అలాగే కన్యారాశిలో ఉన్న రవి, శుక్రులు తులారాశిలోకి వెళ్లారు. ఇవి గ్రహ స్థితిలో వచ్చిన మార్పులు కాగా అక్టోబర్ లో మేష రాశి వారికి రవి శుక్రుల స్థితి వలన నీచ బుద్ధి కలిగి ఉంటారు.
మేష రాశి వారు అనుకున్న పనిలో విజయాలను సాధిస్తారు.కోర్టు వ్యవహారాలు, భూమి తగాదాలు, భార్యాభర్తల వ్యవహారాలలో కొంచెం బెడిసి కొట్టేటట్లు కనిపిస్తుంది. భార్యాభర్తలు విడాకులు తీసుకునేటట్లు కనిపిస్తుంది. అలాగే రోడ్డు యాక్సిడెంట్స్ ఎక్కువగా అవ్వడానికి అవకాశం ఉంది. పండితులకు కళాకారులకు కొన్ని అవమానాలు జరిగేటట్లు కనిపిస్తుంది. మేష రాశి వారు ఈ నెలలో శుభవార్తలను వింటారు. ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. సరైన ఆలోచన ఉంటుంది. బంధువర్గ సహాయ సహకారాలు ఉంటాయి. శత్రువుల నుంచి విముక్తి పొందుతారు. శత్రువులపై మీదే పై చేయి అవుతుంది.

అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులు అవుతారు.అలాగే భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. ధనాన్ని సంపాదించడానికి సరైన మార్గాన్ని ఎంచుకుంటారు. విద్యార్థుల విషయంలో చక్కగా ఉంది. సంతానం లేని వారికి చక్కని ఫలితం రాబోతుంది. దూరపు ప్రయాణాలు చేయాలనుకుంటే వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా మేష రాశి వారికి స్త్రీలతో సమస్యలు ఎక్కువగా ఉండనున్నాయి. ప్రేమ వ్యవహారాలు బెడిసి కొట్టేటట్లు ఉన్నాయి. ఉద్యోగ విషయంలో కొంచెం ఓర్పుగా ఉండాలి. చేనేత కార్మికులు కర్షకులకి శారీరక శ్రమ ఉంటుంది. రాజకీయ నాయకులు తొందరపడకూడదు. వ్యాపారులకు మంచి పురోగతి ఉంటుంది.