Zodiac Signs : అక్టోబర్ నెలలో సింహ రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే…?

Advertisement

Zodiac Signs : సింహ రాశి వారికి అక్టోబర్ నెల 2022 లో రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గ్రహ స్థితి గురించి తెలుసుకుందాం. ఈ నెలలో నాలుగు గ్రహాల మార్పు జరగనుంది. మేషరాశిలో రాహువు యొక్క సంచారం , తులా రాశిలో కేతువు, మకరంలో వక్రించిన శని భగవానుడు ఉన్నాడు. అలాగే మీనంలో వక్రించిన గురువు యొక్క ఒక్క సంచారం జరుగుతుంది. వృషభంలో ఉన్న కుజుడు మిధునంలోకి చేరుతున్నాడు. అలాగే కన్యారాశిలో రవి, బుధ, శుక్రులు ఉన్నారు. ఈ గ్రహస్థితిని అనుసరించి సింహ రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి ఫైనాన్స్ సంబంధిత విషయాలలో ఆదాయం పెరగనుంది. కుటుంబ సభ్యుల కలయిక, బిజినెస్ సంబంధిత విషయాలను ప్రారంభిస్తారు. కొత్త అగ్రిమెంట్స్ చేస్తారు. కొత్త ప్రదేశాలకు వెళతారు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ మాసం అనుకూలంగా ఉంది. ఆరోగ్య సంబంధిత విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ధైర్యంగా కొన్ని పనులను చేస్తారు. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. పనులలో ఆటంకాలు ఉంటే గణపతిని ఆరాధించాలి. దీంతో అడ్డంకులు తొలగిపోతాయి.

Advertisement
horoscope october 2022 check your zodiac signs gemini
horoscope october 2022 check your zodiac signs gemini

అగ్రిమెంట్ విషయాలలో తొందరపడకూడదు. అగ్రిమెంట్ చేసేటప్పుడు ఆచితూచి అనే విషయాలను తెలుసుకొని అగ్రిమెంట్ చేయాలి. లేదంటే ఇబ్బందులు పడతారు. కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రమోషన్ విషయాలలో అనుకూలంగా ఉంది. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టమైన వారిని వివాహ చేసుకుంటారు. ధన ఆదాయం చక్కగా ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పూర్తిగా అవగాహన చేసుకుని చేయాలి. సింహ రాశి వారికి ఈనెల అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే దత్తాత్రేయ ఆరాధన చేయాలి. నిత్యము తెల్లటి పుష్పాలతో గణపతికి నామాలు చదువుతూ సమర్పించాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది.

Advertisement