Zodiac Signs : కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల 2022 లో రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గ్రహ స్థితి గురించి తెలుసుకుందాం. ఈ నెలలో నాలుగు గ్రహాల మార్పు జరగనుంది. మేషరాశిలో రాహువు యొక్క సంచారం , తులా రాశిలో కేతువు, మకరంలో వక్రించిన శని భగవానుడు ఉన్నాడు. అలాగే మీనంలో వక్రించిన గురువు యొక్క ఒక్క సంచారం జరుగుతుంది. వృషభంలో ఉన్న కుజుడు మిధునంలోకి చేరుతున్నాడు. అలాగే కన్యారాశిలో రవి, బుధ, శుక్రులు ఉన్నారు. ఈ గ్రహస్థితిని అనుసరించి కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారికి మానసిక స్థితి సరిగా ఉండదు. ధన విషయంలో చక్కగా ఉంటుంది. విదేశాలకు వెళ్లి వ్యాపారం చేయాలనుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఆగిపోయిన పనులు మరల మొదలు పెడతారు. ఆగిపోయిన పనులు విజయవంతంగా సాగాలంటే గణపతి పూజ చేయాలి. ఉలవలు వంటి వాటిని దానం చేయాలి. సంతానం విషయంలో పిల్లలను విదేశాలకు పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి.

వివాహ సంబంధిత విషయాలలో పార్ట్ నర్ కు సంబంధించిన విషయాలలో ఎటు నిర్ణయాలను తీసుకోలేరు. పిహెచ్డి చదువుకున్నవారు విదేశాలకు వెళ్లి ఉద్యోగాలను సాధిస్తారు. రైతులకి, రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. పార్టనర్ షిప్ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి ఈనెల అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. కుమారస్వామి ఆరాధన చేయాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆరాధన చేయాలి. ఇలా చేస్తే వ్యాపారంలో చక్కటి లాభాలు వస్తాయి.