Zodiac Signs : తులా రాశి వారికి అక్టోబర్ నెల 2022 లో రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గ్రహ స్థితి గురించి తెలుసుకుందాం. ఈ నెలలో నాలుగు గ్రహాల మార్పు జరగనుంది. మేషరాశిలో రాహువు యొక్క సంచారం , తులా రాశిలో కేతువు, మకరంలో వక్రించిన శని భగవానుడు ఉన్నాడు. అలాగే మీనంలో వక్రించిన గురువు యొక్క ఒక్క సంచారం జరుగుతుంది. వృషభంలో ఉన్న కుజుడు మిధునంలోకి చేరుతున్నాడు. అలాగే కన్యారాశిలో రవి, బుధ, శుక్రులు ఉన్నారు. ఈ గ్రహస్థితిని అనుసరించి మేష రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
అక్టోబర్ మాసంలో తులా రాశి వారికి ఫైనాన్స్ సంబంధిత విషయాలలో ఆదాయం చక్కగా ఉంది. ఇన్వెస్ట్మెంట్ మూలంగా ధనా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రుణ సమస్యలు తొలగిపోతాయి. ఏవైనా వస్తువులను కొనేటప్పుడు వాటిని పూర్తిగా పరిశీలించి కొనుగోలు చేయాలి. తల్లి ఆరోగ్య విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. రైతుల ప్రధానంగా నల్లరేగడి భూముల సాగు చేసేవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి.

వివాహ విషయంలో ఆన్లైన్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ సంబంధాలు సక్సెస్ అవుతాయి. దూర ప్రాంతాల సంబంధాలు కుదురుతాయి. దూర ప్రాంతాల సంబంధాలను చూసుకోండి. తండ్రితో వాగ్వాదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ విషయం మార్పులు జరిగే అవకాశం ఉంది. తులా రాశి వారికి అక్టోబర్ నెలకి అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే దక్షిణామూర్తిని ఆరాధించాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటది.