Zodiac Signs : అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే…?

Advertisement

Zodiac Signs :  మిథున రాశి వారికి అక్టోబర్ నెల 2022 లో రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గ్రహ స్థితి గురించి తెలుసుకుందాం. ఈ నెలలో నాలుగు గ్రహాల మార్పు జరగనుంది. మేషరాశిలో రాహువు యొక్క సంచారం , తులా రాశిలో కేతువు, మకరంలో వక్రించిన శని భగవానుడు ఉన్నాడు. అలాగే మీనంలో వక్రించిన గురువు యొక్క ఒక్క సంచారం జరుగుతుంది. వృషభంలో ఉన్న కుజుడు మిధునంలోకి చేరుతున్నాడు. అలాగే కన్యారాశిలో రవి, బుధ, శుక్రులు ఉన్నారు. ఈ గ్రహస్థితిని అనుసరించి మిథున రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

అక్టోబర్ మాసంలో మిథున రాశి వారికి కన్స్ట్రక్షన్ విషయాలలో చక్కగా ఉంది. అనుకున్న పనులు విజయవంతం అవుతాయి. సొంతంగా బిజినెస్ చేయడానికి ఈనెల అనుకూలంగా ఉంది. ఆస్తుల విషయంలో శుభ ఫలితాలు ఉంటాయి. శత్రువులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ సంబంధిత రంగంలో కొద్దిగా ఒత్తిడి ఉన్న అనుకున్న ఫలితాలను సాధిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గవర్నమెంట్ సంబంధిత రంగాలలో అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు, సంతాన సంబంధిత వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకునే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.

Advertisement
horoscope-october-2022-check-your-zodiac-signs-Gemini
horoscope-october-2022-check-your-zodiac-signs-Gemini

వివాహ సంబంధిత విషయాలలో చూసుకున్నట్లయితే రెండవ పెళ్లి కోసం చేసే ప్రయత్నాలు కచ్చితంగా ఫలిస్తాయి. ఇన్సూరెన్స్ రియల్ ఎస్టేట్ సంబంధిత విషయాలలో ఆలస్యం ఉండకూడదు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని విషయాలలో వాయిదా వేయకుండా ఉండడం మంచిది. ఇతర ప్రాంతాల లేదా దేశాల వ్యక్తుల ద్వారా ఉద్యోగాలను సాధిస్తారు. ఆన్ లైన్ బిజినెస్ చేసేవారికి ఈనెల అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి అక్టోబర్ నెలలో అన్ని విధాలుగా బాగుండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే గణపతిని ఆరాధించాలి. వెంకటేశ్వర స్వామిని నిత్యం దర్శించుకోవాలి. గోవులకు బెల్లం, గ్రాసము శనివారం మంగళవారాలలో తినిపించాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది.

Advertisement