MONEY : ఆస్ట్రాలజీ ప్రకారం గ్రహాలలో నెమ్మదిగా కదిలె గ్రహం శని. ఈ శని దేవుడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాసిని మారుతాడట.మంచి చెడులను ఆధారంగా కర్మను ఇస్తాడు కాబట్టి శనిదేవుని కర్మదాత , న్యాయదేవుడు అని అంటారు. అయితే అక్టోబర్ నెలలో కొన్ని రాశుల వారికి శని దేవుని యొక్క కటాక్షం ఉంటుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.అయితే శని దేవుని యొక్క చల్లని చూపు ఆ రాశుల వారి పైన ఉంటుందట. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మేషరాశి: ఈ రాశి గల వారికి శని సంచారం పదో పాదంలో జరుగుతుంది. దీనివలన వ్యాపారస్తులు భారీగా లాభాలు అందుకుంటారు.అలాగే ఉద్యోగులకు మరిన్ని కొత్త ఆఫర్లు వస్తాయి.
అలాగే భారీగా సంపాదన పొందుతారు.శని ప్రయాణించే మార్గాన్ని బట్టి మేషరాశి వారు ఈనెల ఎక్కువగా విజయాలు అందుకుంటారు.ఇంతకుముందు విసిగించిన మరియు ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తి అవుతాయి.కర్కాటక రాశి: ఈ రాశి వారికి శని సంచారం ఏడవ పాదంలో జరుగుతుంది. ఈ రాశి వారికి శని మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత జీవితం నుండి దుఃఖాలు దూరమవుతాయి.సమాజంలో గౌరవాన్ని పొందుతారు.ఒత్తిడి తగ్గుతుంది ఉద్యోగ వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు.ఈ రాశి వారి వైవాహిక జీవితం సుఖంగా మారుతుంది.తులారాశి: ఈ రాశి వారికి శని నాలుగవ పాదంలో సంచరిస్తుంది.

శని గ్రహ సంచారం వలన అక్టోబర్ నుండి తులారాశి వారికి అనుకున్నవన్నీ జరుగుతాయి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.వృశ్చిక రాశి: ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో శని మార్గం ద్వారా మహర్దశ కలుగుతుంది. ఇంటి మరియు వాహన విషయంలో సంతోషం చేకూరుతుంది.వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ తొలగి సంతోషంగా ఉంటారు.అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.మీన రాశి: ఈ రాశి వారు శని అనుగ్రహంతో ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు.ఉద్యోగ, వ్యాపారాలలో విజయాలను అందుకుంటారు.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాలను ప్రజల విశ్వాసాలను మరియు ఇంటర్నెట్లో లభించిన సమాచారం ఆధారంగా రాయడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.