Tirumala Temple Unown History : తిరుపతి దెగ్గరలో ఒక గ్రామం ఉండేది . అక్కడ ఒకడు చెప్పులను కుట్టుకుంటూ తన జీవనంను కోనసాగిస్తున్నాడు. అతడికి శ్రీ వేంకటేశ్వరుడు దర్శనం ఇచ్చాడని ఆ గ్రామ ప్రజలు చెబుతుండేవారు. ఇది పూర్వంలో నిజంగానే జరిగిన ఒక చెప్పులు కుట్టుకునేవాని కథ .ఇది నిజంగానే జరిగిందని కోందరు అంటుంటే,మరికోందరేమో లేదు అని అంటున్నారు. ఏదైమైన ఈ కథను ఒకసారి తెలుసుకుందాం… పూర్వంలో ఒక గ్రామంలో మాళ సంత్తతికి చెందిన ఒక పేదవాడు చేప్పులు కుట్టుకునేవాడు ఉండేవాడు.ఇతడు తిరుమలకి వేళ్ళే దారిలో తాను చేప్పులను కుట్టుకుంటూ ఉండేవాడు. ఇతడికి తిరుమల వేళ్ళి శ్రీనివాసుడిని దర్శించుకోవాలని కోరిక ఉండేది. కాని అతడికి తిరుమల వేళ్ళే అంత ధనం తన దెగ్గర లేదు . తన మనసులోనే ఆ స్వామివారిని తలుచుకుంటూ తన వృత్తిని చెసుకునేవాడు. అయితే అతను తిరుపతి వేళ్ళలేక పోయిన , తిరుపతికి వేళ్ళే దారిమార్గంన భక్తులకు అన్నదానం, తను చేప్పులు కుట్టగా వచ్చిన ధనంతో ఉన్నంతలో రోజుకి ఒకరి మాత్రం కడుపునిండా అన్నం పేట్టగలిగేవాడు.
ఇలా రోజూ చేస్తూ ఉండేవాడు. అయితే ఇలా ఉండగా ఒకానోక్క రోజున ఆ తిరుమల తిరుపతి శ్రీనివాసుడు అతని సేవాగుణంకు ,తన భక్తికిమేచ్చి ఆ చెప్పులు కుట్టేవాడి దెగ్గరకు ఆ శ్రీనివాసుడు చినిగిన దూస్తులతో మారువేశంలో అక్కడకి వచ్చాడు . తన దెగ్గరకు సాక్ష్యాత్తూ ఆ శ్రీవేంకటేశ్వరుడే వచ్చాడు అని అతడికి తెలియదు. ఆ శ్రీనివాసుడు తన కాళి చెప్పు తెగినది కుట్టమని అతడికి ఇస్తాడు . చెప్పును కుట్టినందుకు తనకు ధనము నాదెగ్గర పావలాలో సగమే ఉందన్నాడు మారువేశంలో ఉన్న శ్రీనివాసుడు. మంచిమనసుతో పర్వాలేదు అంతే ఇవ్వు అన్నాడు ఆ చెప్పులుకుట్టేవాడు. అయితే చెప్పులుకుట్టేవాడు మారువేశంలో ఉన్న శ్రీనివాసుడుని తన ఆతిధ్యంను స్వికరించవలసిందిగా కోరాడు .సరె అన్నాడు ఆ భగవంతుడు. చెప్పులు కుట్టేవాడిని కూడా తనతో కలసి తినమన్నాడు ఆ శ్రీనివాసుడు . పస్ట్ ముధ్ధ తనకు పేట్టి తన ఆతిధ్యాన్ని స్వకరిస్తుండగా మరో వ్యక్తి వచ్చి భాగా ఆకలిగా ఉంది నాకు కూడా భోజనం పేట్టవా అన్నాడు .

అప్పుడు ఆ చెప్పులు కుట్టేవాడు తాను తినబోయే భోజనంను మరో అతిధీకి ఇచ్చి తాను లెచాడు. వారు తింటూ ఉండగా మరో వ్యక్తి వచ్చి చాలా ఆకలిగా ఉంది .కళ్ళు తిరుగుతున్నాయి , భాగా ధాహం వేస్తుంది నాకు కూడా కోంచ్చం అన్నం పేట్టగలరా అని అడిగాడు . అప్పుడు అతడు చెప్పులు కుట్టగా వచ్చిన డబ్బునంతా ఖర్చు చేసి తనకు కూడా ఆతిధ్యాన్ని ఇచ్చాడు. వీరు తింటుండగా మళ్ళి మరోక మూగ్గురు వ్యక్తులు భోజనం పెట్టమని అడిగాడు . అప్పుడు అతడి చెప్పులన్నిటి అమ్మేసి మరి భోజనం పెట్టాడు. మళ్ళి మరికోంత మంది భోజనం అని వచ్చారు వారికి పెట్టడాని తన దెగ్గర ఏమి లేదు .అప్పడే మారు వేశంలో ఉన్న శ్రీనివాసుడు తన పాదరక్షణను తాకట్టు పెట్టి ధనంను తిసుకొని రా అని పంప్పాడు . ఆ చెప్పును మారువడి షాపులో తాకట్టు పేట్టాడు . ఈ స్వామివారి పాదరక్షణకు చాలా ధనమును ఇచ్చాడు ఆ మారువాడి. ఆ వచ్చిన ధనముతో తన దెగ్గరకు ఆతిధ్యం కోసం వచ్చిన వారందరికి కడుపు నిప్పగలిగాడు . భోజనం చేసి వేళ్ళిన వారంతా వారు తిన్న ఒకోక్క ఆకుల కింద ఒక్కక్క బంగారు నాణ్యంను పేట్టి వేళ్ళారు . వేనుదిరిగి చూస్తే అతడికి ఏవ్వరు కనపడరు .అప్పటి వరకు తేలియదు ఆ చేప్పులు కుట్టేవానికి తన ఇంటికి మారువేశంలో వచ్చింది ఆ శ్రీ వేంకటేశ్వరుడేనని . ఆ చేప్పులు కుట్టేవానికి కన్నీరు ఏకదాటిగా తన్నుకోని మరి వస్తుంది .బోరు బోర్న ఏడ్చాడు.
చెప్పులుకుట్టుకునే నాలాంటి వానికోసం ఆ భగవంతుడు వచ్చాడని తెలుసుకున్నాడు. అప్పటి నుండి తను ఒక సాదువులాగా మారి ప్రతినిత్యం ఆ శ్రీనివాసుని సేవకై అంకితమైయాడు. ఇలా కోంత కాలం గడచిన తరువాత తను తాకట్టు పేట్టిన స్వామివారి పాద రక్షణలు గుర్తుకవచ్చి .అక్కడికి వేళ్ళి మారువాడికి ఆ 108 కాసులు ఇచ్చి ఒక్క పాదరక్షణలు మాత్రమే వేంట తేచ్చుకున్నాడు. ఇంతవరకు ఏవ్వరుకూడా ధరించనటువంటి పాదరక్షణలను తయారు చేసుకోని తిరుమలకు భయలు దేరాడు. ఆ చేప్పులను తిసుకోని ఏక్కడి వేలుతున్నాడో ,ఎవరికోసం వెలుతున్నాడో అతడికే తెలియడం లేదు.అలా నడుస్తూ నడుస్తూ తిరుమల మోకాళి పర్వతం దెగ్గరకు వచ్చెసరికి .అక్కడ మరోక వ్యక్తి అచ్చం తాను తయారుచేసిన పాదరక్షణల వలే తాను తయారుచేయడం మరోక పెద వాడి చేతిలో చూశాడు. అలా వారిద్దరికి ఆశ్చర్యంగా అనిపించింది .ఒకేరకమైన పాదక్షరణలను తయారుచేశామని ఒకరికోకరు జరిగిన కథనంతా చేప్పుకున్నారు.ఇంచుమీంచు ఆ ఇద్దరి కథలు ఒకేలా ఉన్నాయి.
ఇదంతా ఆ ఏడుకోండలడైన శ్రీనివాసుడి కటాక్షంమేనని అర్ధంచేసుకునేలోపు .స్వామివారు వారిద్దరి ముందు ప్రత్యక్షంమైయాడు. అప్పుడు స్వామివారు మీ భక్తికి మేచ్చాను .మీకు ఏవరం కావలేనో కోరుకొండి అని అడుగగా .వారు ఆ భగవంతుడి వైపు అలాగే చూస్తూ ఆనందభాష్పాలతో స్వామీ నీ దరశ్శన భాగ్యం కన్నమరోక వరమేముంటుంది స్వామీ అని . తమ కోరికను సధా మీ సేవకై అంకితంమవ్వాలని కోరుకున్నారు . వారికోరిక స్వార్ధ రహతమైనది కావడం చేత ఆ భక్తులకు మోక్షం ను ప్రసాధించాడు . వారు ఎంత గోప్ప భక్తులు కాకపోతే స్వామీ వారే స్వయంబుగా తమ కోసం వస్తాడు. అందుకే అంటారేమో హూండిలలో నగలు , ధనమును ,వేండికాసులను దండిగా వేయనక్కరలేదు .మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ఆరాధిస్తే చాలు .ఆయన ఏల్లప్పుడు మనతోనే ఉంటాడు. కోంతమంది చెప్పిన పర్రకారం ఇప్పటికి ఆ ఇరువురి మాళవారి కుటుంబంవారు ఏ వృత్తిలో ఉన్న సరే స్వామీవారికి ఇరువైపులనుండి పాదరక్షణలను ఒక్కోక్కటి తేచ్చి రెండు జతచేస్తే స్వామీ వారి పాదాలకు ఆ జత సరిపోయోలా ఉంటాయని చెపుతుంటారు. ఇదే విషయాన్ని మరికొంత నిష్టాతులను అడిగి తెలుసుకొగా ఇప్పుడైతే ఇలాటింది తిరుమలలో జరగడంలేదని చేప్పుకోచ్చారు. ఇలాంటి ఒక కథ ప్రాచుర్యంలోని ఏలా వచ్చిందో కాని .ఏదైమైనా ఇలాంటి కథ ఒకటి ఉందని భగవంతుడు మాద్వారా తెలియబర్చడం మా అదృష్టంగా భావించి మీకు ఈ కథను తెలియ జేయడం జరిగింది.పూర్తి వీవరణ కోరకు ఈ క్రింద వీడియోని చూడగలరు.