Shani Dev : భారతదేశంలో దేవుళ్లను పూజించడం అనేది ఆనవాయితీగా వస్తున్న పద్ధతి. ఇక్కడ దేవుళ్లను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇలా పూజించడంతోపాటు కొన్ని రకాల నియమాలను కూడా పాటించవలసి ఉంటుంది. మరి ముఖ్యంగా శనీశ్వరుని పూజ అంటే కొన్ని రకాల నియమాలను తప్పనిసరిగా పాటించాలి లేకుంటే దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది. శనీశ్వరుని పూజలో తప్పులు చేస్తే పూజించిన ఫలితం దక్కకపోవడమే కాకుండా శనీశ్వరునికి కోపం తెప్పించినట్లు అవుతుంది. అయితే ఈ పూజ లో ఎలాంటి తప్పులు చేయకూడదో, ఎలా చేస్తే శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా శని దేవుడుని గ్రహ ప్రభావం లేదా శనీశ్వరుని సంబంధిత గ్రహ దోషాలు ఉండకూడదని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
ఎవరైతే శనీశ్వరుని యొక్క పూజ చేస్తారో వారు చాలా నియమాలను పాటించాలి.ఆ పూజ సమయంలో ఒంటిపై ధరించే దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పూజ సమయంలో శనీశ్వరునికి ఇష్టమైన నలుపు రంగు దుస్తుల ను మాత్రమే ధరించాలి. అలాగే శనీశ్వరుడు యొక్క ఆలయానికి వెళ్లినప్పుడు కూడా శని దేవునికి ఎదురుగా నిల్చుని పూజించకూడదు. కొంచెం పక్కగా నిలబడి పూజించాలి. అలాగే పూజ అయిపోయినాక తిరిగి వెళ్లేటప్పుడు శనీశ్వరునికి వెన్ను చూపించకుండా అలాగే వెనుకకు నడుచుకుంటూ వెళ్లాలి. అలా కాకుండా వెన్ను చూపించి పోతే శనీశ్వరునికి కోపం వస్తుంది.అలాగే పూజ చేసే సమయంలో కేవలం శని దేవుని పాదాలను మాత్రమే చూడాలి.

ఆయన కల్లలోకి అసలు చూడకూడదు.పూజించే సమయంలో ఎప్పుడు కూడా తూర్పుముఖంగా కూర్చుని పూజ చేస్తారు. కానీ శనీశ్వరుని పూజలో ఆ తప్పు అస్సలు చేయకూడదు. శనీశ్వరుని పూజ చేసేటప్పుడు ఆలయంలో పశ్చిమంగా ముఖమును చూపిస్తూ కూర్చోవాలి. అలాగే శనీశ్వరునికి నూనె సమర్పించే పాత్రను కేవలం ఇనుము పాత్రను మాత్రమే ఉపయోగించాలి. రాగి పాత్రను అస్సలు ఉపయోగించకూడదు ఎందుకంటే రాగి పాత్ర సూర్యునికి చాలా ఇష్టమైన పాత్ర . ఇక సూర్యుడు శని దేవుడు శత్రువులు కాబట్టి శని దేవునికి రాగి అంటే అసలు ఇష్టం ఉండదు.