Vastu Tips : మన భారతీయ సంస్కృతిలో భగవంతుని పూజ ప్రధానం. అతి పవిత్రమైన దేవుడిని ఆరాధించడంలో మన భారతీయులు ముందుంటారు .భగవంతుని ప్రార్థించడం ద్వారా తమకు మంచి జరుగుతుందని ప్రగాఢ నమ్మకం. అయితే భగవంతునికి నైవేద్యంగా సమర్పించే ఆహార పదార్థాల జాగ్రత్త లేకుంటే కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. నైవేద్యాలకు సంబంధించిన నియమాలను పాటిస్తే మంచిదని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అవేంటో మనం తెలుసుకుందాం. అయితే శాస్త్రంలో భగవంతునికి నిర్దేశించిన ఆహార పదార్థాలను నైవేద్యంగా భావిస్తారు. ఈ నైవేద్యాన్ని చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.
అయితే కొంతమంది భగవంతునికి సమర్పించిన నైవేద్యాన్ని తిరిగి భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తారు. నైవేద్యాన్ని తినడం ద్వారా తమ ఆరోగ్యం మంచిగా ఉంటుందని నమ్ముతారు. మరికొందరు ఆ ప్రసాదాన్ని అక్కడే ఉంచేస్తారు. కొన్ని గందరగోళ సమయాలలో నైవేద్యం విషయంలో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి. అసలు భగవంతునికి నిర్దేశించిన పదార్థాలను మనం తినకూడదని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే దైవారాధనలో ప్రత్యేకంగా భగవంతునికి నైవేద్యం పెడతారు లేదా వండిన పాత్రలను ముందుగా దేవుడికి నిర్దేశించిన తర్వాత పదార్థాలను ప్రసాదంగా స్వీకరిస్తారు. అయితే కొన్నిచోట్ల నైవేద్యంగా భగవంతునికి సమర్పించిన పదార్థాలను అలాగే దేవుని దగ్గరనే ఉంచేస్తున్నారు.

కానీ నిజానికి దేవుడికి నైవేద్యంగా సమర్పించిన పదార్థాలను కొంత సమయం తర్వాత అక్కడ నుండి తీసివేయాలి. లేదా ప్రసాదంగా చేసి అందరికీ పంచాలి. ఇలా చేయడం వలన భగవంతుడు సంతోషిస్తాడు అలాగే ఆ ప్రసాదాలను స్వీకరించిన వారికి మంచి జరుగుతుంది. అలా కాకుండా నైవేద్యంను అలాగే వదిలేస్తే అవి కొద్దిసేపటికి పాడైపోతాయి. అలా పాడైపోయిన నైవేద్యాలను భగవంతుని ముందు ఉంచితే ఆ ఇంటికి అరిష్టం వాటిల్లుతుంది. గృహ సంతోషాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి నైవేద్యం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే దేవునికి నైవేద్యంగా సమర్పించే పదార్థాలను కేవలం రాగి , వెండి ,బంగారం, మట్టి లేదా చెక్క పాత్రలోనే సమర్పించాలి. శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం ఆ ఇంటికి ఆ కుటుంబానికి చాలా మంచిది. గమనిక : ఈ కథనాన్ని సాధారణ నమ్మకాలు మరియు ,ఇంటర్నెట్ లో లభించే అంశాల ఆధారంగా వ్రాయడం జరిగింది.