Peacock : భారతదేశ జాతీయ పక్షి అయిన నెమలికి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే జ్యోతిష్య నిపుణులు నెమలి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం నెమలి ఆకస్మాత్తుగా కనిపిస్తే చాలా శుభప్రదం అని భావిస్తారు. అలాగే ఇంకొన్ని సందర్భాల్లో చూస్తే ఇంకా మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు . అయితే ఎలాంటి సమయంలో చూస్తే మనకు శుభప్రదము ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెల్లవారుజామున అకస్మాత్తుగా నెమలి కనిపిస్తే : తెల్లవారుజామున అనుకోకుండా నెమలి మీ ఇంటి వైపు వస్తే అదృష్టం వెతుకుంటూ మీ ఇంటికి వచ్చినట్లే .
దీంతోపాటు కుటుంబంలో అనేక అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే ఇంట్లో కొన్ని శుభకార్యాలకు ఇది సూచనగా చెప్పవచ్చు. అలాగే ఎటైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు అకస్మాత్తు గా నెమలి కనిపిస్తే చాలా అదృష్టం. ఇక మీరు వెళ్లే పని కచ్చితంగా పూర్తి అవుతుంది. ఆ పని పూర్తికాకుండా ఎవరు ఆపలేరు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయాన్నే నెమలి గొంతు వినడం లేదా నెమలి ఈకలను చూడడం కూడా మంచిది. అలాగే ఎగిరే నెమలి కనిపిస్తే : ఎగిరే నెమలిని చూడటమంటే చాలా కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే నెమలులు చాలా అరుదుగా ఎగురుతాయి.

ఇక అలాంటి దృశ్యం చూసిన వారి సంఖ్య చాలా తక్కువ. కావున ఇలాంటి దృశ్యాలు చూసిన వారికి అదృష్టం తమ వెంటే ఉంటుంది. వీరు ఎలాంటి పనిచేసిన దాంట్లో విజయం సాధిస్తారు. అలాగే నెమలిపించాన్ని బెడ్ రూమ్ గదిలో పెట్టుకొని తెల్లవారుజామున లేవగానే దానిని చూడడం వలన రాహు గ్రహ దోషాల నుంచి విముక్తి పొందవచ్చు. నెమలి పించం తో తయారైన చిత్రపటాలను పడకగదిలో పెట్టుకుంటే చాలా మంచిది.
నెమలి కలలో కనిపిస్తే : అలాగే నెమలి కలలో కనిపిస్తే అది కచ్చితంగా శుభసూచకం అని చెప్పాలి. అలాగే పాము నెమలి పోట్లాటను కలలో చూసినట్లయితే అది ఒక మంచి సంకేతం అని చెప్పవచ్చు ఇక మీ శత్రువులు మీకు దూరంగా ఉంటారు, వారు ఎన్ని కుట్రలు పంన్నిన మీ మీద విజయం పొందలేరు. అలాగే కలలో శని దేవునితో నెమలి కనిపిస్తే అది చాలా అదృష్టదాయకంగా ఉంటుంది. అలాగే తెల్ల నెమలి కలలో వారికి ధనప్రాప్తి లభిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు.