Telugu Hero : సినీ పరిశ్రమలోని నటుల జీవితాలు చాలా భిన్నంగా ఉంటాయి. సర్దుకుపోయి బ్రతకడం అనేది వారికి అసలు అలవాటు ఉండదు. ఇబ్బంది అనిపిస్తే విడిపోవడం లేదా మరో పెళ్లి చేసుకోవడం లాంటివి చేస్తారు. దీనిలో భాగంగా నటుడు పృథ్వీరాజ్ తన భార్యను వదిలేసి రెండవ వివాహం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పృధ్వీరాజ్ కర్ణాటక కు చెందినవాడే కానీ తెలుగులో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది . చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన పృథ్వీరాజ్ తమిళ్ మరియు తెలుగు సినిమాలలో బాగా రాణించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా “అమ్మ మనసు” మూవీలో చేసి పెద్దయ్యాక “పెళ్లి” మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టాడు పృథ్వీరాజ్.
ఇక ఆ సినిమాలోని పృథ్వి విలక్షణా నటన అందర్నీ బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత “పెళ్లి పందిరి” సినిమాలో సెకండ్ హీరోగా జగపతి బాబుతో నటించాడు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఆయనకు తెలుగులో అవకాశాలు వరుసగా వచ్చాయి. కానీ హీరోగా అంతా సక్సెస్ ను అందుకోలేక పోయారు. ఆ తర్వాత సమరసింహారెడ్డి , దేవుళ్ళు, నువ్వు నాకు నచ్చావ్, చెన్నకేశవరెడ్డి వంటి హిట్ సినిమాలలో పృధ్వీరాజ్ నటించారు. ఇక ఆ తర్వాత తమిళ్ సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు పృథ్వీరాజ్.అయితే పృధ్వీరాజ్ 1994లో బీనా అనే ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడు.

అయితే వీరి కొడుకుకు ఆరోగ్యం సరిగా ఉండదని సమాచారం. అయితే పృధ్వీరాజ్ మరియు బీనా విడిపోయారు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరికీ మనస్పర్ధలు రావడంతో విడిపోయారని సమాచారం. ఇక విడిపోయిన తర్వాత పృథ్వీరాజ్ రెండో వివాహం చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తనకంటే చాలా చిన్నదైనా మలేషియా అమ్మాయిను పృథ్వి పెళ్లి చేసుకున్నారట. ఇక అమ్మాయి పృధ్వీరాజ్ కంటే 33 సంవత్సరాలు చిన్నదట. ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసి కాపురం ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ విషయంపై పృధ్విరాజ్ స్పందించడం లేదు. ఈ విషయంపై ఎవరైనా స్పందిస్తే కానీ అసలు నిజం ఏంటో తెలియదు.