Samantha : 1980 లో నటించిన సీనియర్ హీరోయిన్ సరిత హీరోయిన్ గా,డబ్బింగ్ చాలా సినిమాలలో నటించి సౌత్ ఇండియాలో పాపులర్ అయింది. ఇక ఈమె అసలు పేరు అభిలాష. ఈమె పుట్టి పెరిగింది అంతా గుంటూరులోనే. తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అన్ని ఇండస్ట్రీలో కలిపి దాదాపుగా 500 కు పైగా సినిమాలలో నటించింది సరిత. 1980లో ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్లలో సరిత ఒకరు. ఇదే కాకుండా అప్పట్లో చాలామంది స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పేదట సరిత . ఆ తర్వాత 1990 లో వచ్చిన స్టార్ హీరోయిన్స్ నగ్మా ,విజయశాంతి, సౌందర్య ,రమ్యకృష్ణ , వంటివారికి కూడా ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేసిందట. అసలు ఆమె లేకుండా అప్పట్లో సినిమా ఉండేది కాదని కొందరు ప్రముఖులు చెబుతున్నారు. ఇవే కాకుండా సరిత సీరియల్స్ లో కూడా నటించడం విశేషం. ఇక ఇమే నటనకు గాను ఎన్నో స్టేట్ అవార్డ్స్ లభించాయి. ఆరుసార్లు ఫీలింగ్ ఫేర్ అవార్డు కూడా లభించింది.
ఆ తర్వాత బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఒక సినిమా ఆమెకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో కమలహాసన్ హీరోగా నటించగా అయన తో పోటీపడి నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అప్పట్లో ఒక నల్ల పిల్ల కమలహాసన్ కు ఏమాత్రం తీసుకోకుండా నటించిందని ప్రతి ఒక్కరు అనేలా చేసింది . ఇమె సినీ జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే సినీ జీవితంలో ఎంతో సక్సెస్ ను అందుకున్న సరిత వ్యక్తిగత జీవితంలో మాత్రం అప్పటినుంచి ఇప్పటివరకు కూడా అడ్డంకులను ఎదుర్కొంటుంది. సరిత సినీ ఇండస్ట్రీకి రాకముందు వెంకటసుబ్బయ్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. కానీ సినీ రంగ ప్రవేశం కోసం ఆయనకు విడాకులు ఇచ్చి వచ్చేసింది. ఆ తర్వాత సినిమాలో స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న సమయంలో స్టార్ కెమెరా మెన్ అయిన నవకాంత్ తో ప్రేమలో పడింది. వీళ్ళ ప్రేమాయణం కొన్నాళ్లపాటు సాగింది , ఇక పెళ్లి చేసుకుంటారు అనుకునే సమయంలో విధి వైపరీత్యం నవకాంత్ ప్రమాదవశాత్తు మరణించాడు.

ఇక ఆ బాధ నుంచి కోల్పోవడానికి సరితకు చాలా సమయమే పట్టిందని చెప్పాలి. ఈ సంఘటన జరిగిన కొన్నాళ్లకు సరిత తన తోటి నటుడైన ముఖేష్ తో ప్రేమలో పడింది. వీరు పెళ్లి కూడా చేసుకున్నారు. వీరికి ఇప్పుడు ఇద్దరు కొడుకులు. సరిత తన భర్త పిల్లలతో హ్యాపీగా ఉంటున్న సమయంలో తన భర్త ముఖేష్ మరో నటితో క్లోజ్ గా ఉంటూ సరితని దూరం పెట్టాడు. ఇక సరిత ఇండియాలో లేని సమయంలో విడాకులు నోటీస్ ఇచ్చి దానికి జవాబు ఇవ్వడం లేదని కారణం చూపించి సరితకు తెలియకుండానే విడాకులు తీసుకున్నాడు ముఖేష్. విషయం తెలుసుకున్న సరిత ఇండియాకు వచ్చి కోర్టులో కేసు వేసిన ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో ప్రస్తుతం సరిత తన పిల్లలతోనే దుబాయ్ లో ఉంటుంది.
