Bigg Boss 6 Telugu : బుల్లితెర రియాలిటీ షో రంజుగానే సాగుతుంది. ఈ షో21 మంది సభ్యులతో మొదలు కాగా, షో నుండి ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈవారం నామినేషన్స్‌లో భాగంగా ఒక్కొక్కరు ఇద్దరిద్దరు చొప్పున నామినేట్ చేయాలని.. ఎవర్నైతే నామినేట్ చేయాలని అనుకుంటారో వాళ్ల తలపై కుళ్లిపోయిన టమోటాలను పగలగొట్టాలని చెప్పారు బిగ్ బాస్. దీంతో నామినేషన్స్ రచ్చ మొదలు పెట్టి నానా హంగామా చేశారు. మొత్తంగా ఈ నామినేషన్స్‌లో పది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.
ఇనయ, రేవంత్, ఆరోహి, సూర్య, సుదీప, శ్రీహాన్, గీతు, రాజ్, అర్జున్, కీర్తి ఈ పది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. బిగ్ బాస్ చరిత్ర లోనే మొట్టమొదటిసారి హోస్ట్ చేత నామినేట్ చెయ్యబడ్డ అర్జున్ కళ్యాణ్ మరియు కీర్తి లలో..అర్జున్ కళ్యాణ్ కాస్త డేంజర్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆరోహి రావు చాలా తెలివిగానే గేమ్ ఆడుతున్నా ఎందుకో తెలియదు కాని ఇప్పుడు చివరి స్థానానికి పడిపోయింది. అర్జున్ కళ్యాణ్ కి మరియు ఆరోహి రావు కి మధ్య వోటింగ్ తేడా చాలా స్వల్పంగా ఉంది..ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడం పక్కా అని మాత్రం తేలిపోయింది..

Bigg Boss 6 Telugu : ఎవరు ఎలిమినేట్ అవుతారు..
ఎక్కువ శాతం ఆరోహి రావు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అర్జున్ కొంచెం శ్రీసత్యతో పులిహోర కలుపుతూ కంటెంట్ ఇస్తున్నాడు. ఆరోహి అయితే సూర్యతో కాస్త అతిగా ప్రవర్తిస్తుందనే టాక్ ఉండడంతో ఆరోహిని బయటకు పంపించే పని పెట్టుకుంటున్నారని అర్ధం అవుతుంది. ఇనాయ సుల్తానా రెండవ స్థానం లో కొనసాగుతుంది..ఇక మూడవ స్థానం లో శ్రీహన్, నాల్గవ స్థానం లో కీర్తి మరియు 5 వ స్థానం లో గీతూ రాయల్ కొనసాగుతున్నారు..ఇక మొదటి వారం నుండి చివరి రెండు స్థానాల్లో కొనసాగుతూ వచ్చిన రాజ్ శేఖర్ తన ఆతని బాగా మెరుగుపరుచుకోవడం తో వోటింగ్ లైన్ లో ఆరవ స్థానాంకి ఎగబాకాడు.