Roja : రోజా గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడు

Advertisement

Roja : రోజా.. ఈ పేరు గురించి తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగు, త‌మిళ చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించి ఓ ఊపు ఊపిన హీరోయిన్స్‌లో రోజా ఒక‌రు. సినిమాల్లో తెగ పాపులారిటీని సంపాదించుకున్న త‌ర్వాత ఆమె రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెల‌వ‌ట‌మే కాదు.. మంత్రిగానూ ప‌ని చేస్తున్న రోజా ఫైర్ బ్రాండ్‌గా ఇమేజ్ ద‌క్కించుకుంది. సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగులో చిరంజీవి నుంచి అగ్ర‌హీరోలంద‌రితో న‌టించారు. అలాగే త‌మిళంలో ర‌జినీకాంత్ స‌హా టాప్ స్టార్స్ అంద‌రితో న‌టించి మెప్పించారామె.

Advertisement

రోజా గురించి జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడు అభి తాజాగా ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. రోజా గారి గురించి మీ అభిప్రాయం ఏమిటి? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. “రోజా గారు ఒక ఎమ్మెల్యే గా, జడ్జ్ గా గొప్ప స్థానంలో ఉన్నా కూడా గర్వం చూపించకుండా అక్కడ పనిచేసే ఆర్టిస్టులు అందరితో చాలా బాగా కలిసిపోయేవారు. అంతేకాకుండా ఎవరైనా కష్టమని ఆమెను సహాయం అడిగితే త‌ప్ప‌క సాయం చేసేవారు. అందుకే జ‌బ‌ర్ధ‌స్త్ టీం అంద‌రు కూడా ఆమెని ఎంత‌గానో ఇష్ట‌ప‌డేవారు అంటూ అదిరే అభి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం అభి చేసిన కామెంట్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Advertisement
abhi intresting comments on roja
abhi intresting comments on roja

Roja : రోజా గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

ఇక అదిరే అభి విష‌యానికి వ‌స్తే.. జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న అదిరే అభి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆశించిన స్థాయిలో క్రేజ్ రాకపోవడానికి గల కారణాలను అన్వేషించలేదని ఆయన తెలిపారు. మ‌నకంటూ ఒకటి సొంతంగా క్రియేట్ చేయాలనే ఆలోచనతో మంచి స్కిట్లు చేయాలని నేను భావించానని అదిరే అభి తెలిపారు. కొట్టుకునే స్కిట్లు, అభ్యంతర స్కిట్లు చేయకూడదని నేను అనుకున్నానని అదిరే అభి వెల్లడించారు.అందరూ చూసే స్కిట్లు చేయాలని నేను అనుకున్నానని అదిరే అభి పేర్కొన్నారు. జ‌బ‌ర్ధ‌స్త్ షోకి నేను ఏదైన చేయాల‌నే ఉద్దేశంతోనే వెరైటీ స్కిట్స్ చేశానంటూ అభి పేర్కొన్నారు.

Advertisement