Bigg Boss 6 Telugu : రసవత్తరమైన షో బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం రోజురోజుకి మంచి మజాని అందిస్తుంది. 21 మంది హౌజ్‌మేట్స్ ఇంట్లోకి అడుగుపెట్టగా, వారిలో ఇద్దరు హౌజ్ నుండి బయటకు వెళ్లిపోయారు.ఇందులో షాను, అభినయశ్రీ ఉన్నారు. హౌస్‌లో మొత్తం 21 మంది ఉంటే.. అతి తక్కువగా ఫుటేజ్‌లో చూపించింది అభినయ శ్రీనే. హౌస్‌లో ఉన్నామా తిన్నామా పడుకున్నామా అనేవాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్లతో పోల్చుకుంటే అభినయ చాలా బెటర్. అనవసరమైన విషయాల్లో దూరకుండా.. కంటెంట్ ప్రొడ్యూస్ చేయడానికి కక్కుర్తి పడకుండా తన పని తాను చేసుకుంటూ మెచ్యుర్డ్‌గా ఉంటుంది అభినయ.
కాని సెకండ్ కంటెస్టెంట్‌గా అభినయ శ్రీని ఎలిమినేట్ చేసి ఆశ్చర్యపరిచారు. అయితే ఏ మాత్రం బాధపడకుండా బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చేసిన అభినయ … ఫైమా, చంటి, శ్రీ సత్య, బాలాదిత్య, సూర్యలని హానెస్ట్ కేటగిరిలో చేర్చింది. ఫైమాకు.. పెద్ద ఫ్యాన్.. షటప్ అనే రీల్‌ను కొన్ని వందల సార్లు చూశాను.. నేను హ్యాపీగా ఉండటానికి కారణం ఆమె.. అని ఫైమా గురించి చెప్పేసింది అభినయ. ఇక చంటి..నాకు అన్నయ్యలాంటివాడు.ఆయకు అనవసరంగా కోపం రాదు.. ఇష్టం లేకపోతే మాట్లాడడు. చాలా హానెస్ట్ అని చెప్పేసింది. ఇక శ్రీ సత్యకు.. ఎక్కువ కోపం.. హానెస్ట్.

ఆమె టాప్ 5లో ఉంటుంది.. మా అమ్మతో ఉంటే ఎలా కంఫర్ట్‌గా ఉంటానో సత్యతో ఉంటే అలా ఉంటాను అని చెప్పి ఎమోషనల్ అయింది.. బాలాదిత్య.. చాల మంచివాడని, సూర్య.. నా తమ్ముడు అని చెప్పుకొచ్చిన అభినయ శ్రీ .. డిస్ హానెస్ట్ కేటగిరీలో అయితే ఒక్క రేవంత్ పేరు మాత్రమే చెప్పింది. ఆట మధ్యలో పర్సనల్ విషయాలు చెప్పి సింపథీ క్రియేట్ చేస్తాడు.. అది నాకు నచ్చలేదు.. నువ్ కన్నింగ్‌లా అనిపిస్తున్నావ్ అని ఆయన మొహం మీదే చెప్పాను.. అంటూ అభినయ స్పష్టం చేసింద.ఇక గలాటా గీతూని ఫైటర్‌గా వర్ణించిన ఆమె టాప్ 3లో తప్పక ఉంటుందని చెప్పుకొచ్చింది అభినయ.