Nayanthara : సామాన్య జనాల గురించి ఎవ్వరూ పట్టించుకోరు. వాళ్లను అడిగే నాథుడే ఉండడు. అదే సెలబ్రిటీల గురించి అయితే అందరికీ కావాలి. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ లోకి కూడా తొంగిచూడటం అందరికీ అలవాటు. అందుకే సెలబ్రిటీల జీవితం తెరిచిన పుస్తకం లాంటిది అంటారు. సెలబ్రిటీలు మనకు వ్యక్తిగతంగా తెలియకున్నా వాళ్ల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, ఆతృత అందరికీ ఉంటుంది. అందుకే.. వాళ్ల గురించి ఎక్కువ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తుంటాయి. వాళ్ల టాపిక్సే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా నయనతార కవలలకు జన్మనిచ్చారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సరోగసీ ద్వారా నయనతార పిల్లలను కన్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో అసలు ఇండస్ట్రీలో ట్విన్స్ కు జన్మనిచ్చిన టాప్ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
యాంకర్ ఉదయభాను తెలుసు కదా. తనకు కూడా ట్విన్సే పుట్టారు. ఇద్దరూ అమ్మాయిలే. వాళ్ల పేర్లు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర. అలాగే.. మంచు విష్ణుకు కూడా ట్విన్స్ పుట్టారు. విరానికాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వాళ్ల పేర్లు అరియానా, వివియానా. బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాకు కూడా ట్విన్స్ ఉన్నారు. ఇద్దరు కొడుకులు. వాళ్ల పేర్లు లవ్ సిన్హా, కుష్ సిన్హా. వీళ్ల తర్వాతనే సోనాక్షి సిన్హా జన్మించింది.

Nayanthara : సన్నీ లియోన్ కు కూడా ట్విన్సే
సన్నీ లియోన్ కు కూడా ట్విన్స్ పుట్టారు. ఇద్దరూ కొడుకులే. వాళ్ల పేరు ఆషర్ సింగ్, నోవహ్. ఫరాఖాన్ కు ట్రిప్లెట్స్ పుట్టారు. వాళ్ల పేర్లు క్జార్ కుందర్, అన్య కుందర్, దివా కుందర్. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఇక బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కు ఇద్దరు కవలలే. ఒకరు కూతురు, ఇంకొకరు కొడుకు. వాళ్ల పేర్లు రూహీ జోహార్, యష్ జోహార్. సెలీనా జైట్లీకి కూడా ఇద్దరు కవలలు పుట్టారు. ఇద్దరూ కొడుకులే. విన్ స్టన్ హాక్, విరాజ్ హాగ్. సంజయ్ దత్ కు ఇక్రా దత్, షహరాన్ దత్ అనే కవలలు ఉన్నారు. తమిళ హీరో భరత్ కు ఇద్దరు ట్విన్స్.