Aditi Rao : హీరోయిన్ అదితి రావు సమ్మోహనం అనే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ భాషల్లో కూడా ఇమే నటిస్తుంది. ఇక ప్రస్తుతం హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో ఉన్నట్లుగా వస్తున్న వార్తలతో మరింత పాపులర్ అయింది. అయితే అదితి చివరగా శర్వానంద్ సిద్ధార్థ్ , నటించిన మహాసముద్రం సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
అయితే ఇటీవల అదితి రావు హైదరి పుట్టినరోజు సందర్భంగా హీరో సిద్ధార్థ అదితి ఫోటోను షేర్ చేస్తూ నా హృదయ రాకుమారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు
దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది. సిద్ధార్థ ఇలా అతిధిని విష్ చేయడంతో వీరి మధ్య నిజంగానే ప్రేమ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అదితి పాల్గొనగా ఆమె కెరియర్ లో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. మొదటగా ఆమె భరత నాట్యంలో , ప్రావీణ్యం సాధించారట. అలాగే దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు చేశారట.

తన ప్రదర్శన చూసి కోలీవుడ్ డైరెక్టర్ శారద తనకు మొదటిసారిగా సినిమాలో అవకాశం ఇచ్చిందని అదితి తెలియజేసింది. అయితే తాను సినిమాలలోకి రాకముందు చాలా సమస్యలను ఎదుర్కొందట. సినిమాలోకి వచ్చిన తర్వాత కూడా తన మొదటి సినిమా విడుదల ఆలస్యం అవ్వడంతో నా మొదటి సినిమాకి ఇన్ని అడ్డంకులు ఎందుకు వస్తున్నాయంటూ ఫీల్ అయ్యారట. ఇక ఈ విషయంపై పలుసార్లు ఏడ్చిందట ఆదితి. తన తల్లి ముందు ఏడిస్తే తాను బాధపడుతుందని బాత్రూంలోకి వెళ్లి ఏడ్చేదాన్ని అని తెలియజేసింది అదితి. ఇక ఇప్పుడు ఆదితి రావు కి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని చెప్పవచ్చు. ఇక ఇది తన కెరియర్ పై ఎలాంటి ప్రభావం చూపబోతుందో వేచి చూడాలి.