Actor Hema : తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన వారిలో హేమ ఒకరు. హేమ చాలా తెలుగు సినిమాలలో నటించింది. తన కెరీర్ మొత్తంలో దాదాపుగా 200 లకు పైగా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అందరి మన్ననలు పొందింది. అక్క, వదిన, తల్లి , అత్త , లాంటి ఎన్నో రకాల పాత్రలను చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇమె బ్రహ్మానందంతో కలిసి చేసిన కామెడీను ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. జులాయి సినిమాలో వీరిద్దరి మధ్య ఉండే కామెడీ సీన్స్ దీనికి నిదర్శనం. ఈమె సినిమాలలో నటించడంతోపాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ లో కూడా పాల్గొంటారు.
ఎలక్షన్స్ లో పోటీ చేస్తూ యాక్టివ్ గా కనిపిస్తారు హేమ. ఈమధ్య జరిగిన ఎన్నికల్లో కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు హేమ.హేమా యొక్క ఆన్ స్క్రీన్ లైఫ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కానీ ఆఫ్ స్క్రీన్ లైఫ్ ఎలా ఉంటుందనేది ఎవరికి తెలియదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన గురించి చెబుతూ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పింది హేమ. తన తండ్రికి ఇద్దరు భార్యలని దాంతో వారికి ఆరుగురు సంతానమని, వారందరిలోకెల్లా తను చురుగ్గా ఉంటానని ,అందుకే మా వాళ్లు నన్ను గారాబంగా పెంచారని చెప్పుకొచ్చింది హేమ. ఎక్కువ మంది ఉండడంతో కుటుంబ పోషన కష్టం అవడం వలన తండ్రి వ్యవసాయంతో పాటు తాపీ పనులు కూడా చేసేవారట.

సినిమాలో అవకాశం కోసం మద్రాస్ వచ్చిన సమయంలో తల్లితో కలిసి ఉందట హేమ. అప్పుడే తను డబ్బులు ఎలా ఖర్చు చేయాలో నేర్చుకుందట. అలాగే సినిమాలో నటించేందుకు కొన్ని నియమ నిబంధనలను పెట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది హేమ. డబ్బు కోసం ఆశపడటం, అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం నాకు అసలు ఇష్టం ఉండదని, నన్ను ఇతరులు వేలెత్తి చూపకుండా బ్రతకడం ఇష్టమని పేర్కొంది. అలాగే తాను అప్పుడప్పుడు పార్టీలకు వెళ్తారని కానీ మద్యానికి సిగరెట్లకు దూరంగా ఉంటానని ఓపెన్ గా చెప్పింది.