Adavi seshu : ఈ రోజుల్లో సినీ ఇండస్ట్రీలో తమ వయసుకు తగ్గ పనులు ఎవరు చేయడం లేదు. ఎవరి ఇష్టానుసారం వారు నడుచుకుంటున్నారు. దీనికి ప్రత్యేక నిదర్శనం హీరోయిన్స్ యొక్క హాట్ ఫొటోస్. 19 ఏళ్ళ అమ్మాయి మొదలు 50 ఏళ్లు దాటిన ఆంటీల వరకు అందరూ తమ అందాలను ఆరబోస్తున్నారు. విచిత్రమైన బట్టలతో తమ బాడీను ఎక్స్ పోజ్ చేస్తున్నారు పైగా సినీ ఇండస్ట్రీలో అందరూ సమానమే అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఇలాంటి విషయాన్ని, నాగార్జునను సూటిగా అడిగేసాడు మన టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు.
అయితే అక్కినేని నాగార్జున ( akkineni nagarjuna ) హీరోగా సోనాలి చౌహాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా “ది గోస్ట్ ” .ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించనున్నారు. గరుడవేగ లాంటి సీరియస్ యాక్షన్ మూవీస్ ను చేసి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ప్రవీణ్ సత్తార్. దీంతో “ది గోస్ట్” సినిమాపై కూడా భారి అంచనాలు ఉన్నాయి.ఇంకా కొన్ని రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతుంది. దీనిలో భాగంగా అడవి శేషు నాగార్జునను ఇంటర్వ్యూ చేశాడు.

ఈ క్రమంలో అడవి శేషు (adavi sheshu) నాగార్జునతో మాట్లాడుతూ, మీరు ఇంటర్ పోల్ ఆఫీసర్ విక్రమ్ కదా అని అనగా దానికి నాగార్జున నువ్వు గోపి 116 కదా అని అంటాడు.ఇంటర్ పోల్ ఏజెంట్ అంటే , చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి కదా మీరేంటి బోట్లో హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నారని నాగార్జునను అడుగుతాడు. అయితే దీనికి నాగార్జున ఎలా స్పందించారు అనేది పూర్తి ఇంటర్వ్యూ చూస్తేనే తెలుస్తుంది. అలాగే నాకంటూ ఒక జోనర్ క్రియేట్ చేసుకుని సినిమాలు తీసుకుంటుంటే ఇప్పుడు మీరు నా జోనర్ లోకి వచ్చి నా పొట్ట కొడతారా అంటూ అడవి శేషు నాగార్జునను అడుగుతాడు . దీనితో నాగార్జున అడవి శేషు ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.