Adipurush 3D Teaser : ఆదిపురుష్ టీజర్ బాలేదు అన్న వాళ్ళు అందరూ నోరు మూసుకునే బ్రేకింగ్ న్యూస్

Advertisement

Adipurush 3D Teaser : ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు రానంత నెగిటివ్ పబ్లిసిటీతో పాటు ట్రోలింగ్ ప్రభాస్ ఆదిపురుష్ టీజర్‌పై జరిగింది. అక్టోబర్ 2 ముందు వరకు ఆదిపురుష్‌పై ఆకాశమంత అంచనాలున్నాయి. కానీ ఎప్పుడైతే టీజర్ వచ్చిందో అప్పట్నుంచే దీనికి బ్యాడ్ టైమ్ మొదలైంది. అసలు ఇలాంటి సినిమా కోసమా ప్రభాస్‌ను ఇన్నాళ్లూ కష్టపెట్టారు అంటూ దర్శకుడు ఓం రౌత్‌తో పాటు నిర్మాతలను కూడా ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు అభిమానులు. ఇలాంటి సమయంలో ప్రభాస్ కూడా మౌనంగా ఉండటం లేనిపోని అనుమానాలకు తావిచ్చింది. పైగా మొన్నటి వీడియో బాగా వైరల్ అయింది. దర్శకుడు ఓం రౌత్‌ను ప్రభాస్ తన రూమ్‌కు పిలవడం.. అందులో ప్రభాస్ కాస్త సీరియస్‌గా ఉండటంతో ఆయన కూడా టీజర్‌పై అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం మొదలైంది.

Advertisement

అయితే అందులో ఎలాంటి నిజం లేదని.. ప్రభాస్ సైతం ఆదిపురుష్ టీజర్‌తో పాటు ఔట్ పుట్‌పై సంతోషంగానే ఉన్నాడని తాజాగా హైదరాబాద్‌లో జరిగిన 3డి టీజర్ స్క్రీనింగ్‌తో అర్థమైపోయింది.తాజాగా ఆదిపురుష్ సినిమా టీజర్‌ను ప్రత్యేకంగా అభిమానుల కోసం హైదరాబాద్‌లోని AMBలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మరో 70 థియేటర్స్‌లో కూడా 3డి వర్షన్ టీజర్ విడుదల చేస్తున్నారు. ఈ 3D వర్షన్ టీజర్ చూసిన తర్వాత సినిమాపై అభిప్రాయాలు మారిపోతాయంటున్నాడు హీరో ప్రభాస్. అలాగే దిల్ రాజు సైతం ఇదే చెప్పాడు. అనవసరంగా ట్రోల్ చేస్తున్న వాళ్లకు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చాడు.

Advertisement
adipurush breaking news viral
adipurush breaking news viral

Adipurush 3D Teaser:  3డి టీజర్ అదరహో..

రామాయణంలో ఓ భాగం తీసుకుని.. దాన్ని నేటి జనరేషన్ ఆడియన్స్‌కు తీసారే కానీ అది పూర్తిగా రామాయణం కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు దిల్ రాజు. అలాగే ట్రోలింగ్ చేయడం అనేది ఈ మధ్య ప్రతీ సినిమాకు కామన్ అయిపోయిందని.. బాహుబలిని కూడా వదలని వాళ్లకు ఆదిపురుష్ లెక్కే కాదంటున్నాడు దిల్ రాజు. ఇది కూడా పక్కా హిట్ బొమ్మ అని.. రేపు థియేటర్స్‌లో 3డి ఆదిపురుష్ చూసి అంతా అద్భుతం అంటారంటున్నాడు ఈ నిర్మాత. ఫ్యాన్స్ ఈ సినిమా చూసి థ్రిల్ అవ్వడం ఖాయం అంటున్నాడు ప్రభాస్ కూడా. ఆదిపురుష్ కేవలం బిగ్ స్క్రీన్ కోసమే చేశామని చెప్తున్నారు మేకర్స్. మొత్తానికి 3 డి వర్షన్ టీజర్ చూసిన తర్వాత ఆదిపురుష్‌పై లెక్కలు మారిపోతాయని నమ్ముతున్నారు మేకర్స్.

Advertisement