Adipurush : అన్ని బ్యాడ్ న్యూస్ ల మధ్యలో ఆదిపురుష్ సినిమాకి ఒక బ్లాక్ బస్టర్ గుడ్ న్యూస్

Advertisement

Adipurush : ఓం రావత్ గురించి తెలుసు కదా. బాలీవుడ్ లోనే ఆయన టాప్ డైరెక్టర్. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే క్రేజ్ ఉన్న డైరెక్టర్లలో ఆయన ఒకరు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏం లేదు. తానాజీ సినిమాతో తనేంటో నిరూపించుకున్నాడు ఓం రావత్ ( Om Rout ). ప్రస్తుతం ఓం రావత్.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రామాయణం ఇతిహాసం ఆధారంగా వస్తోంది. ఈ సినిమాలో రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.

Advertisement

అంటే సైఫ్ ది విలన్ పాత్ర అన్నమాట. రాముడిగా ప్రభాస్ ( prabhas ), సీతగా కృతి సనన్ ( Kriti Sanon ) నటిస్తున్నారు. ఇప్పటికే ఆది పురుష్ మూవీ నుంచి టీజర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుందనుకుంటే ఆ టీజర్ పై ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి.ఆది పురుష్ సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది. ఈ సినిమాను బిగ్ స్క్రీన్ కోసం సిద్ధం చేశాం. ఏదో ఒక చిన్న వీడియోను చూసి సినిమాపై అప్పుడే ఒక అంచనాకు రాకండి. సినిమా విడుదల అయ్యాక.. ఆ సినిమాను చూసి ఒక్కరు కూడా నిరాశ చెందరు.

Advertisement
Adipurush director om raut responds over trolling
Adipurush director om raut responds over trolling

Adipurush : ఆదిపురుష్ ట్రోల్స్ పై స్పందించిన ఓం రావత్

కావాలంటే నేను బాండ్ కూడా రాసిస్తా అంటూ ఓం రావత్ తెలిపారు. ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ అలరించే సినిమా అని ఓం రావత్ చెప్పుకొచ్చారు. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12 విడుదల కానుంది. ఈ సినిమాను చూసిన తర్వాత ఎవ్వరూ నిరాశ చెందరని.. బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు సినిమా డైరెక్టర్ ఓం రావత్. చూద్దాం మరి.. ఆది పురుష్ మూవీ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో?

Advertisement