Adipurush : ఆదిపురుష్ టీజర్ విషయం లో జనం బండ బూతులు తిడుతున్న మ్యాటర్ ఇదే !

Advertisement

Adipurush : ప్ర‌భాస్, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఓంరౌత్ తెర‌కెక్కించిన చిత్రం ఆదిపురుష్‌. ఈ సినిమా కోసం కొన్నాళ్లుగా ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తుండ‌గా, తాజాగా టీజ‌ర్ విడుదల చేశారు. ఈ టీజ‌ర్‌పై మిక్స్‌డ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఒక కార్టూన్ మోషన్ పిక్చర్ టీజర్ ని చూస్తున్నామనే భావన కలిగిస్తోందని ట్రోల్ చేశారు. చాలా సన్నివేశాలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ – ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మరియు ప్రసిద్ధ ఆన్ లైన్ టెంపుల్ రన్ గేమ్ నుండి కాపీ చేయబడ్డాయని కామెంట్స్ చేశారు. ప్ర‌భాస్ ( prabhas ) అభిమానులు, హిందువులు కూడా టీజర్ పట్ల సంతోషం గా లేర‌ని తెలుస్తుంది.

Advertisement

త్రీడీ మోషన్ పిక్చర్ క్వాలిటీతో ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ అదేమీ అంత క్వాలిటీతో లేదు అని అసలు చిన్న పిల్లలు చూసే బొమ్మల తరహాలో గ్రాఫిక్స్ ఉంది అని ఆవేదన చెందుతున్నారు. అసలు ఈ రేంజ్ లో ఉంటుంది అని ఊహించలేదు అని దర్శకుడు ఇన్ని రోజులు కష్టపడింది దీని కోసమా అని షాక్ అవుతున్నారు. దారుణంగా అయితే ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పటికి నెగిటివ్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ మైథలాజికల్ డ్రామా కూడా ఉత్తరాది ప్రేక్షకులను హిందుత్వ ట్రాన్స్ లోకి తీసుకెళ్తుందని అందరూ భావించారు. అయితే టీజర్ రిలీజ్ అయ్యాక అన్నీ మారిపోయాయి.

Advertisement
adipurush gets trolls
adipurush gets trolls

Adipurush : పాపం దారుణం..

‘ఆదిపురుష్’ లో రావణుడు పాత్రని చూపించిన విధానంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో లంకేశ్ పాత్రలో నటించిన సైఫ్ అలీఖాన్ ను శివుడి భక్తుడిగా కాకుండా.. ఇస్లామిక్ విలన్ గా ప్రెజెంట్ చేసారని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రావణుడు అనగానే అందరూ ఊహించుకునే రూపానికి.. ఆది పురుష్ లో సైఫ్ కనిపించిన తీరుకు అసలు పొంతనే లేదని కామెంట్స్ చేస్తున్నారు. అతను రావణ్ గా కాకుండా.. అలావుద్దీన్ ఖిల్జీగా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘డిజప్పాయింటింగ్ ఆదిపురుష్’ ‘బాయ్ కాట్ బాలీవుడ్ కంప్లీట్లీ’ వంటి హ్యాష్ ట్యాగ్స్ ని నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. ‘ఆది పురుష్’ రిలీజ్ అయ్యే నాటికి ఈ చిత్రం ఇంకెన్ని ప్ర‌చారాలు జ‌రుగుతాయో చూడాలి.

Advertisement