Aishwarya – Dhanush : రజనీకాంత్ మాట అంటే లెక్క లేదా… మళ్లీ విడిపోయిన ఐశ్వర్య ధనుష్…!

Advertisement

Aishwarya – Dhanush : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ , సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలిసిన తర్వాత ఇరు కుటుంబాలు ఒప్పుకొని వారిద్దరికీ గ్రాండ్ గా పెళ్లి చేశారు. 19 సంవత్సరాల పాటు కలిసి వైవాహిక జీవితాన్ని గడిపిన ఈ జంట ఇటీవల విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు చాలా బాధపడ్డారు. సూపర్ స్టార్ రజనీకాంత్ వీళ్ళను కలపడానికి ప్రయత్నించిన వీరి నిర్ణయం మార్చుకోలేదట.

Advertisement

చేసేది ఏమి లేక లైట్ తీసుకున్నాడు సూపర్ స్టార్. ఇక అభిమానులైతే వాళ్ళిద్దరు విడిపోకూడదు అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా గత వారం రోజులుగా వీరిద్దరూ మళ్ళీ ఒకటి అవుతారు అంటూ వార్తలు వినిపించాయి. ఈ వార్తలను విన్న అభిమానులు చాలా సంతోషించారు . కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. దీనికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటంటే ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ ఒకటవ్వడం లేదట.

Advertisement
Aishwarya Dhanush broke up again
Aishwarya Dhanush broke up again

అసలు ఒక్కటవ్వడం ఏమో కానీ కనీసం వీరు మాట్లాడుకోవడం లేదని , కనీసం ఒకరినొకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ధనుష్ సన్నిహితుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ధనుష్ మరియు ఐశ్వర్య మళ్ళీ కలవబోరని తెలుస్తుంది. వారు కేవలం పిల్లలకు సంబంధించిన విషయాలు మాత్రమే చూసుకుంటున్నారని , అంతకుమించి వారి మధ్య ఎలాంటి రిలేషన్ ఉండటం లేదని చెబుతున్నారు. అయితే పిల్లల కోసం వీరు కలిసినప్పుడు ఈ పుకార్లు వచ్చి ఉంటాయని అంటున్నారు. అసలు వాస్తవానికి వస్తే ఇకపై వీరిద్దరూ కలవడం కష్టమని తెలుస్తుంది.

Advertisement