Samantha : అద్దిరా నాగార్జున అంటే .. సమంతకి ఇలాంటి వ్యాధి వచ్చింది అని తెలిసి వెంటనే ఏం చేశాడో చూడండి !

Advertisement

Samantha : స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సమంత మొదటి సినిమా ఏం మాయ చేసావే సినిమా టైంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీర ప్రేమ కు ఇంట్లో పెద్దలు కూడా అడ్డు చెప్పకుండా గ్రాండ్ గా పెళ్లి చేశారు. ఇక ఈ జంట కి తెలుగు సినీ ఇండస్ట్రిలో మంచి క్రేజ్ ఉంది . కాని ఎవరు ఊహించని విధంగా ఈ జంట విడిపోయారు. చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత అక్కినేని ఫ్యామిలీ సమంతను పట్టించుకోవడం మానేసింది .సమంత కూడా పెళ్లి తర్వాత అసభ్యకర సీన్స్ లను కూడా చేస్తూ వస్తుంది. అలాగే నాగచైతన్యను మరియు అక్కినేని ఫ్యామిలీను పలుమార్లు విమర్శించి మాట్లాడింది.

Advertisement

కానీ అక్కినేని ఫ్యామిలీ ఎవరు సమంత మాటలకు స్పందించలేదు. ఇక ఆమె ఏం మాట్లాడిన ఏం చేసినా పట్టించుకోకుండా వదిలేశారు. ఇది ఇలా ఉండగా తాను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లుగా సమంత ప్రకటించింది. మయోసైటిస్ అని వ్యాధితో తాను బాధపడుతున్నట్లుగా సోషల్ మీడియాలో వేదికగా సమంత ప్రకటించింది. ఇక ఈ వ్యాధి గల వారికి నొప్పులు ఎక్కువగా ఉంటాయట. ఏ చిన్న పని చేసిన , కొంచెం దూరం నడిచిన అలసిపోతారట. అలాగే కొన్ని సందర్భాలలో కళ్ళు తిరిగి పడిపోతారు.

Advertisement
Akkineni nagarjuna is standing by Samantha
Akkineni nagarjuna is standing by Samantha

ఈ విషయం తెలుసుకున్న సమంత ఫాన్స్ తను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే సమంత ఏం చేసినా పట్టించుకోని అక్కినేని ఫ్యామిలీ ఈ విషయంపై స్పందించడం విశేషం. సమంత ఆరోగ్యం గురించి తెలుసుకున్న అక్కినేని అఖిల్ సోషల్ మీడియా వేదికగా గెట్ వెల్ సూన్ సామ్ అంటూ పోస్ట్ చేశాడు. అలాగే అక్కినేని నాగార్జున కూడా సామ్ కి పర్సనల్ గా మెసేజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక అక్కినేని ఫ్యామిలీ గురించి మనకు తెలిసిందే. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే కచ్చితంగా సహాయం చేస్తారు. ఇక ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న సమంతకు అక్కినేని ఫ్యామిలీ అండగా ఉండడం చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆమె త్వరగా కోలుకొని యధావిధిగా సినిమాలు చేయాలని కోరుకుందాం.

Advertisement