Allu Aravind : సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చిత్రం కాంతార. మూవీ పేరుకి సంబంధించి అర్ధం తెలియదు. హీరో ఎవరో కూడా తెలియదు. అయినప్పటికి సినిమాని సూపర్ హిట్ చేశారు. నెల 15వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబడుతూ వెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ .. “ఈ సినిమా రిలీజ్ కి ముందు ‘ఒకసారి చూడండి’ అని చెప్పడానికి మీ ముందుకు వచ్చాము .. ఈ స్థాయిలో ఆదరించిన మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇప్పుడు వచ్చాము. సినిమాకి ఎమోషన్ తో తప్ప భాషతో సంబంధం లేదని ‘కాంతార’ మరోసారి నిరూపించింది” అన్నారు.
అయితే నటుడు దర్శకుడు రిషబ్ టాలెంట్ ను పసిగట్టిన అల్లు అరవింద్ అతనికి గీత ఆర్ట్స్ లోనే ఒక మంచి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇ ఇదే మంచి అవకాశం గా తెలుగులో అగ్ర హీరోలతో సినిమా చేయాలి అని ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అతను కూడా నటుడే కాబట్టి స్వీయ దర్శకత్వంలో సినిమా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేవలం 18 కోట్లతో ఒక 100 కోట్ల సినిమా తరహాలో కాంతార సినిమాను తీసాడు కాబట్టి గీతా ఆర్ట్స్ సంస్థ అతనితో మంచి భారీ బడ్జెట్ చిత్రం చేస్తే బాగుంటుందని అందరు సూచన చేస్తున్నారు.

Allu Aravind : వదిలేలా లేరు..
అయితే గీతా ఆర్ట్స్‌లో రిషబ్కి ఛాన్స్ ఇవ్వడం అంటే బ్లాంక్ చెక్ చేతిలో పెట్టినట్టేనని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రిషబ్ తాను అనుభవించిన ఎమోషన్ ను స్వయంగా ఆవిష్కరించడం వలన ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అయింది. ఇది మన సింహాచలానికి దగ్గరగా ఉన్న కథ అనిపించింది. అజనీశ్ లోకనాథ్ ఈ సినిమాకి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం. ఆయన ఎంతలా రీసెర్చ్ చేశాడనేది తెలుసుకుని షాక్ అయ్యాను” అని చెప్పారు. కాంతార సినిమాను నిర్మించిన హోంబల్ ఫిలిమ్స్ కూడా అతనిని వదిలేలా కనిపించడం లేదు.