Pawan Kalyan : టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఇటీవల తన బర్త్ డే జరుపుకున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ బర్త్ డే వేడుకలు దేశ వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించారు. ఆయన బర్త్ డే సందర్భంగా సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఇలా చాలా మంది విషెస్ తెలియజేశారు. ఇక పవన్ నటించిన జల్సాను భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేశారు. చిత్రానికి మంచి ఆదరణ లభించింది. మొత్తానికి అభిమానులు తమ హీరోపై తెగ ప్రేమ కురిపిస్తూ బర్త్ డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నుంచి మాత్రమే కాదు.. సినీ పరిశ్రమ, రాజకీయ నాయకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
Pawan Kalyan : వివాదం సమసిపోలేదా?
మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, రవితేజ, రామ్ పోతినేని సహా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పలువురు బీజేపీ నేతలు , ఏపీ సహా ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్, రాజ్యసభ ఎంపీ జీవీఎల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటి అనేక మంది పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలను సోషల్ మీడియా వేదికగా చెప్పారు. అంతేకాదు కొంతమంది పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసి.. విషెష్ చెప్పడం విశేషం..అయితే అల్లు ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ మాత్రం పవన్ బర్త్ డే విషెస్ చెప్పలేదు. చిరంజీవి బర్త్‌డేకు విష్ చేసిన అల్లు అర్జున్ మరి పవన్‌కు ఎందుకు విషెస్ చెప్పకపోవడం ఈ వార్తలకు మరోసారి ఆజ్యం పడింది. ఒక్క బన్నీ మాత్రమే కాదు అల్లు శీరిష్ కానీ, బన్నీ భార్య స్నేహా రెడ్డి సైతం పవన్ కల్యాణ్‌ని విష్ చేస్తూ ఎలాంటి పోస్ట్ పెట్టలేదు.

దీంతో మెగా ఫ్యామిలీ-అల్లు ఫ్యామిలీకి విభేదాలు ఉన్నా మాటే నిజమేనా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆ మధ్య రామ్ చరణ్, బన్నీ అభిమానుల మధ్య ఎంత పెద్ద రచ్చ జరిగిందో మనం చూశాం. ఫ్యామిలీ సభ్యులని కూడా గొడవలో ఇన్వాల్వ్ చేస్తూ నానా రచ్చ చేశారు. అయితే ఈ విబేధాలపై అల్లు అరవింద్ రీసెంట్గా స్పందిస్తూ.. మొదట్నుంచి ఉన్న బంధుత్వమే ఇప్పటికీ ఉందని, తమ కుటుంబాల మధ్య విబేధాలు వచ్చాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఎవరి స్టార్డమ్ వాళ్లకు వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు రావడం సహజమే అని ఆ వార్తలను ఆయన కొట్టిపారేశారు. కాని ఇప్పుడు బన్నీ ఫ్యామిలీ ఎవరు విషెస్ చెప్పకపోవడంతో వివాదం నిజమేనా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.