Pushpa 2 Movie : పుష్ప 2 కోసం ఎదురు చూస్తోన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి వెంట్రుకలు నిక్కబొడుచుకునే బ్రేకింగ్ న్యూస్ !

Advertisement

Pushpa 2 Movie : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో ని చేసిన సినిమా పుష్ప ది రైజ్..ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. ఇక భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన పాత్రకు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు పెరిగాయి. కై సినిమా రెండవ భాగమైన పుష్ప ది రూల్ ఎప్పుడు ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తు న్నారు. అయితే ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్ నడుస్తుందట.

Advertisement

ఇక దీనిలో సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ లో ఒకరైన అవినాష్ గోవరిఖర్ పనిచేస్తున్నారట. అయితే పుష్ప ది రైజ్ మూవీ మొదటిగా ఫోటోషూట్స్ తోనే ప్రారంభమైంది. విడుదలై భారీ విజయం సాధించింది. ఇక ఇదే సెంటిమెంట్ ను బన్నీ మళ్ళీ ఫాలో అవుతున్నారట. ఇక ఈ సినిమా కూడా అంచనాలను మించి విజయాన్ని అందుకుంటుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక పుష్ప పార్ట్ కూడా భారీ విజయనందుకుంటే బన్నీకి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ పెరగడం ఖాయం. పుష్ప పార్ట్ 2 దాదాపుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో రానున్నట్లుగా సమాచారం. అలాగే ఈ సినిమాను 2023 డిసెంబర్ లో విడుదల చేయాలనుకుంటున్నారట సుకుమార్.

Advertisement
Allu Arjun fans are waiting for Pushpa 2 Movie
Allu Arjun fans are waiting for Pushpa 2 Movie

ఇదిలా ఉండగా పుష్ప ది రూల్ లో బన్నీ లుక్ మొత్తం మారుస్తున్నట్లుగా తెలుస్తోంది. పుష్ప ది రైస్ లో అయితే పక్కా మాస్ లుక్ లో చూపించారు. అయితే దానిలో ఎదుగుతున్నప్పుడు ఎలా చూపించాలో అలా చూపించారు. ఇక ఇప్పుడు మాత్రం స్టైలిష్ స్టార్ స్టైలిష్ అండ్ క్లాస్ డాన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. పుష్ప సిండికేట్ డాన్ గా ఎదిగాడు కాబట్టి ఆ స్టైల్ కు తగ్గట్టుగా తీసుకురాబోతున్నట్లు సమాచారం. అయితే పార్ట్ 1 లో లాగా కాకుండా పార్ట్ 2 లో బన్నీని మరింత కొత్తగా చూపించబోతున్నారని సమాచారం.

Advertisement