Pushpa 2 : RRR లో ఎన్‌టీఆర్ పులి ఫైట్ ని మించి పుష్పలో ‘ఈ ఫైట్’ ప్లాన్ చేసిన సుకుమార్

Advertisement

Pushpa 2 : పుష్ప వన్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయి ఎలాంటి సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలుసు. పుష్ప ది రైజ్ సినిమా హిట్ అవడం కాదు.. ఏకంగా పాన్ ఇండియా సినిమా అయిపోయింది. నిజానికి ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేసినప్పటికీ.. వేరే భాషల్లో ఇంత రెస్పాన్స్ వస్తుందని, వేరే భాషల్లో ఈ సినిమా ఈ రేంజ్ లో హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ముఖ్యంగా నార్త్ ప్రజలు అయితే ఆ సినిమాను ఓన్ చేసుకున్నారు. ఇక.. పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ కావడంతో సుకుమార్ ఫుల్లు హ్యాపీగా ఉన్నాడు.

Advertisement

పుష్ప 2 ది రూల్ సినిమా షూటింగ్ ను అదే ఉత్సాహంతో తీస్తున్నారు. ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు కానీ.. సినిమా కథ గురించి మాత్రం చాలా కథనాలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. పుష్ప 2 కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో అసలు సిసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రను చంపేస్తున్నారు. అవును.. శ్రీవల్లిని చంపేయడం వల్లనే ప్రీ క్లైమాక్స్ లో పుష్పరాజ్ విశ్వరూపం చూపించబోతున్నాడు.

Advertisement
allu arjun to fight with tiger in pushpa 2 movie
allu arjun to fight with tiger in pushpa 2 movie

Pushpa 2 : శ్రీవల్లి పాత్ర ట్విస్ట్ అదుర్స్

అలాగే.. అల్లు అర్జున్ తో పులి ఫైట్ కూడా ఉంటుందట. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ పులి ఫైట్ ను చూశాం కదా. అందులో ఎన్టీఆర్ విశ్వరూపాన్ని చూశాం మనం. దానికి మించి పుష్ప 2 లో అల్లు అర్జున్, పులి సీక్వెన్స్ ఉంటుందట. దాని కోసమో మూవీ యూనిట్ థాయిలాండ్ కూడా వెళ్లిందట. గ్రాఫిక్స్ పులితో కాకుండా నిజమైన పులితో ఫైటింగ్ ఉంటుందట. అదే ఈ సినిమాలో స్పెషల్ అట. పులి సీన్స్ ఓ పక్క తీస్తుంటే మరోవైపు బన్నీతో కూడా సీన్స్ ను షూట్ చేస్తున్నారట. మరి.. నిజంగానే పులితో అల్లు అర్జున్ ఫైట్ సీన్స్ ఉంటే ఇక మామూలుగా ఉంటుందా.. థియేటర్ దద్దరిల్లిపోవడం ఖాయం అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.

Advertisement