Allu Arjun: స్టైలిష్ స్టార్ నుండి పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఆయన సినిమాలపై జనాలలో చాలా ఆసక్తి ఉంది. పుష్పతో సంచలనం సృష్టించిన బన్నీ ఇప్పుడు పుష్ప2తో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే బన్నీకి ఇప్పుడు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అదే రేంజ్లో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది స్నేహా రెడ్డి. సోషల్ మీడియాలో ఆమె పోస్టులు తెగ వైరల్ అవుతుంటాయి. అల్లు అర్జున్ ఆమెని ప్రేమ వివాహమే చేసుకున్నాడు. తాను ప్రేమించిన స్నేహా రెడ్డిని ఇంట్లో పరిచయం చేసి.. ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు బన్నీ. అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల పెళ్లి మార్చి 6, 2011 న జరిగింది. వీరి వివాహం జరిగి 11 ఏళ్లు పూర్తయ్యింది.
అయితే బన్నీ ఏ హీరోయిన్‌తో అంత రాసుకొని పూసుకొని ఉండడు. పని వరకే అన్నట్టు ఉంటాడు. కాని రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం బన్నీ పర్సనల్ లైఫ్‌లోకి కూడా వచ్చేసిందట. ఈ విషయంలో బన్నీ భార్య స్నేహారెడ్డి కూడా తెగ కోపంగా ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ తో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ సరైనోడు సినిమా లో నటించింది. వీరిద్దరి మధ్య ఈసినిమాలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఈ మూవీ షూటింగ్ టైమ్ లో బన్నీతో అతిగా రాసుకుపూసుకు తిరిగిందట రకుల్ ప్రీత్ సింగ్. అంతే కాదు మెసేజ్ లు… ఫోన్ కాల్స్ వరకూ వెళ్ళిందట. అల్లు అర్జున్ కు ఇష్టం లేకపోయినా.. ఆమెని హర్ట్ చేయలేక మాట్లాడేవాడు అని చెప్పుకొచ్చేవారు.

Allu Arjun : ఎందుకు కోపం..
రకుల్ ప్రీత్ సింగ్ ఓవర్ యాక్టింగ్ చూసి బన్ని భార్య స్నేహారెడ్డికి కూడా బాగా కోపం వచ్చిందట. ఓసారి ఇంపార్టెంట్ టైమ్ లో.. అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఉండగా ఫోన్ చేసి మాట్లాడుతుంటే.. స్నేహా రెడ్డి ఫోన్ తీసుకుని కాల్ కట్ చేసిందంటూ రూమర్ కూడా ఉంది. మరి సోషల్ మీడియలో తెగ హల్చల్ చేస్తున్న ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కాని ఈ గాసిప్ తెగ హల్చల్ చేసింది. ఇక రకుల్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేక చాలా ఇబ్బంది పడుతుంది. బాలీవుడ్లో చేస్తున్నా కూడా టాలీవుడ్లో కి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది.