Anasuya Bharadwaj : అందాల ముద్దుగుమ్మ అనసూయ తన వర్క్‌కి బ్రేక్ ఇచ్చి అబ్రాడ్ వెళ్లింది.దీపావళి పండుగని అక్కడ ఉన్న తన బంధువులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది.అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో అనసూయ క్యూట్ లుక్ లో కనిపించింది. అనసూయ సోదరి వైష్ణవిని కూడా మనం ఈ ఫొటోలలో చూడవచ్చు. ప్రస్తుతం అనసూయ దీపావళి సెలబ్రేషన్ పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అప్పుడెప్పుడో 19 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ. ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ అయిపోయింది..
జబర్దస్త్ షోతో యాంకర్ గా మారిన ఆ తర్వాత నటిగా మారింది.. ఇప్పుడు స్టార్ అయిపోయింది. ప్రస్తుతం సినిమాల కోసం తనకు పేరు తీసుకొచ్చిన జబర్ధస్త్‌ను విడిచిపెట్టింది అనసూయ. టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఆ తర్వాత వరుసగా ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘యాత్ర’, ‘కథనం’, ‘థ్యాంక్యూ బ్రదర్’, ‘ఖిలాడీ’, ‘పుష్ప’ సహా ఎన్నో సినిమాలతోపాటు స్పెషల్ సాంగ్‌లు కూడా చేసింది. ప్రస్తుతం బుల్లితెరపై కనిపంచని అనసూయ సినిమాలలో సందడి చేస్తుంది.. ఇప్పటికే డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న రంగమార్తాండ చిత్రంతోపాటు వేదాంతం రాఘవయ్య, హరిహర వీరమల్లు, పుష్ప 2, భోళా శంకర్ సినిమాల్లో నటించనుంది అనసూయ.

Anasuya Bharadwaj : సెలబ్రేషన్స్ టైం..
అనసూయకు పెళ్లై అప్పుడే 11 యేళ్లు అవుతోంది. ఇంత చరిత్ర చూస్తుంటే అసలు అనసూయకు ఎంత వయసు ఉంటుందనే అనుమానాలు చాలా మందిలో వస్తుంటాయి కూడా. ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడూ అసలు వయసు చెప్పరు.. దాచేస్తుంటారు. ఇక అనసూయ కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది. ముఖ్యంగా ‘క్షణం’, ‘రంగస్థలం’లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. ‘కథనం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ మంచి మార్కులు పొందలేకపోయింది.