Anasuya : అందాల అనసూయ ఇటీవలి కాలంలో చేసే సందడి మాములుగా లేదు. సినిమాలు, టీవీ షోస్ తో తెగ సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ జబర్ధస్త్ కార్యక్రమానికి దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తుంది. అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్బిజీగా ఉంది. ఇప్పటికే ఆమె ‘రంగమార్తాండ’, ‘వేదాంతం రాఘవయ్య’, ‘గాడ్ ఫాదర్’, ‘హరిహర వీరమల్లు’, ‘పుష్ప 2’, ‘భోళా శంకర్’ వంటి భారీ చిత్రాల్లో భాగమైంది. ఇక సోషల్ మీడియాలోనూ అనసూయ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది.
యాంకర్ అనసూయకు భర్త భరద్వాజ్ అంటే వల్లమాలిన ప్రేమ. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఏమో కానీ ఆయన మీద అమితమైన ప్రేమ కురిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ఇంట్లో లేరట. ఏదో పని మీద వేరే ఊరు వెళ్లారట. ఈ క్రమంలో తన ఒంటరి తనాన్ని అనసూయ ఫ్యాన్స్ కి వీడియో రూపంలో తెలియజేసింది.బెడ్ పై పడుకున్న అనుసూయ పక్కనే ఖాళీగా ఉన్న తన భర్త ప్లేస్ చూపించింది. ఆ తర్వాత ఆ వీడియోకి ఓ కామెంట్ పెట్టింది. భరద్వాజ్ ఇంట్లో లేకపోతే గుడ్ నైట్ నాకు నేనే చెప్పుకోవాల్సి వస్తుందని తెగ బాధపడుతూ చెప్పింది.

Anasuya : అనసూయ రచ్చ..
పర్సనల్ విషయాన్ని అంత పబ్లిక్ గా చెప్పేసిన అనసూయని చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. అనసూయ యూట్యూబ్ లో నవస్త్ర పేరుతో పలు వీడియోలు పోస్ట్ చేస్తోంది. అందులో గౌరీ నాయుడుతో పలు విషయాలపై మాట్లుడుతోంది అనసూయ. ఇప్పటికీ రెండు వీడియోలు పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఎపిసోడ్స్ పై నెటిజన్ల దృష్టి మరల్చేందుకే ఇన్ స్టా లో డ్యాన్స్ వీడియోలు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక అనసూయ కెరీర్ మూడు పూలు ఆరు కాయలన్నట్లుంది. నటిగా, యాంకర్ గా రెండు రంగాల్లో ఆమె రాణిస్తున్నారు. వెండితెరపై విరివిగా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో అనసూయ యాంకరింగ్ మీద ఫోకస్ తగ్గించారు.
View this post on Instagram